ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి భేటీ: పార్టీ పరిస్థితులపై చర్చ

కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఇవాళ  న్యూఢిల్లీలో  సమావేశమయ్యారు. 
 

Bhuvanagiri MP Komatireddy Venkat reddy meets AICC Chief  mallikarjun kharge, in New Delhi


హైదరాబాద్: ఎఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గేతో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  బుధవారంనాడు సమావేశమయ్యారు.  ఈ నెల 10వ తేదీన ఎఐసీసీ టీపీసీసీ కమిటీలను ప్రకటించింది.  ఈ కమిటీల్లో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  చోటు కల్పించలేదు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించినట్టుగా సమాచారం. టీపీసీసీ కమిటీల నియామకంలో  కొందరు సీనియర్లకు  చోటు దక్కని విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖర్గేకు వివరించారని సమాచారం.  కమిటీల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై  ఖర్గేతో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు..ఈ నెల 12వ తేదీన  సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు.  త్వరలోనే కలుద్దామని  మల్లుభట్టివిక్రమార్క  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చెప్పారు.

మునుగోడు  ఉప ఎన్నిక  సమయంలో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి   పార్టీ అభ్యర్ధికి కాకుండా  తన సోదరుడికి ఓటు చేయాలని వెంకట్ రెడ్డి  కోరినట్టుగా  ఆడియో సంభాషణ బయటకు వచ్చింది.  మరో వైపు అస్ట్రేలియా  పర్యటనలో  కూడ కాంగ్రెస్ పార్టీపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.  మునుగోడులో  కాంగ్రెస్  పార్టీ విజయం సాధించదని  చెప్పారు.ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ  సీరియస్ గా తీసుకుంది. ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.   

also read:టీపీసీసీ కమిటీల నియామకంపై అసంతృప్తి: హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్న నేతలు

పీసీసీ  కమిటీల  నియామకం విషయంలో  మాజీ మంత్రి  కొండా సురేఖ, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీ.నామా చేశారు. మరో వైపు బెల్లయ్య నాయక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు.  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి  తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలోని అన్ని పార్టీలో  కోవర్ట్ సంస్కృతి పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ పరిస్థితి ఉందని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా  ఇతరులకు కమిటీలో చోటు  కల్పించడంపై దామోదర రాజనర్సింహ మండిపడ్డారు.


 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios