Asianet News TeluguAsianet News Telugu

సమయం లేదు: చంద్రబాబు అరెస్ట్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్టును పట్టించుకొనే సమయం తనకు లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy interesting comments on Chandrababunaidu Arrest lns
Author
First Published Sep 29, 2023, 2:16 PM IST

హైదరాబాద్: చంద్రబాబు అరెస్ట్ పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  శుక్రవారంనాడు హైద్రాబాద్ లోని తన నివాసంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబు అరెస్ట్ గురించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు.  కేసీఆర్ ను గద్దె దింపడం ఎలా అనే దానిపై తాము  ప్రయత్నిస్తున్నామన్నారు. దాని కోసమే  పోరాటం చేస్తున్నట్టుగా చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ గురించి  పట్టించుకోవడం లేదన్నారు.

చంద్రబాబు అరెస్ట్ పై  మీడియాలో వార్తలు వచ్చినా తాను చూడడం లేదన్నారు.ఆ వార్తలు వస్తే టీవీ చానెల్ మారుస్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అయినా ఆంధ్రా గురించి మాకెందుకు అని ఆయన అన్నారు. తమ దృష్టంతా కేసీఆర్ పైనే ఉందన్నారు. మాది మాకే ఉంది... కేసీఆర్ ను గద్దె దింపడంపైనే  కేంద్రీకరించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ గురించి పట్టించుకొనే సమయం తనకు లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. చంద్రబాబు అరెస్ట్ పై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల స్పందించారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత. చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

also read:చంద్రబాబు కేసులో మా వాదనలు వినాలి: సుప్రీంలో ఏపీ సర్కార్ కేవియట్ పిటిషన్

ఆంధ్రాకు చెందిన వారి ఓట్లు కావాలి.. కానీ చంద్రబాబు అరెస్ట్ పై నిరసన తెలిపే హక్కు ఉండదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా నిరసన తెలిపే హక్కు ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు అరెస్టు గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడ  స్పందించారు. బీఆర్ఎస్ కు చెందిన నేతలు  స్పందించడాన్ని పార్టీతో సంబంధం లేదని  కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇది వారి వ్యక్తిగతంగా పేర్కొన్న విషయం తెలిసిందే. 

 

Follow Us:
Download App:
  • android
  • ios