Asianet News TeluguAsianet News Telugu

మాణికం ఠాగూర్ ను తప్పించాలి, రేవంత్ రెడ్డితోనే కాంగ్రెస్ నాశనం:కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా మాణికం ఠాగూర్  స్థానంలో కమల్ నాథ్ కు ఆ బాధ్యతలను అప్పగించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మాణికం ఠాగూర్ ను ఆ పదవి నుండి తప్పించాలని కోరారు. 

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Demands To Remove manickam Tagore As Congress Telangana Incharge
Author
Hyderabad, First Published Aug 22, 2022, 8:30 PM IST

హైదరాబాద్: రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాశనమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సోనియాగాంధీ నివాసంలో జరిగిన సమావేశానికి హాజరు కాకుండా సోమవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ కు వచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్ ను ఈ బాధ్యతల నుండి తప్పించాలని ఆయన కోరారు. కమల్ నాథ్ వంటి నేతలకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం 34 ఏళ్లుగా పనిచేస్తున్న తనలాంటి సీనియర్లకు పార్టీలో అవమానం జరుగుతుందన్నారు.

also read:రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడు: సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరై తాను హైద్రాబాద్ కు వచ్చినట్టుగా ఆయన తెలిపారు.  హడావుడి చేసే లీడర్లకు మాత్రమే పదవులు ఇచ్చారన్నారు. హుజారాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏ రకంగా ప్రచారం చేసి మూడు వేల ఓట్లు తెచ్చుకున్నారో మునుగోడులో కూడా అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు తెచ్చుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.  పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించనందుకు నిరసనగా తాను ఇవాళ ఢిల్లీలో జరిగిన నేను మీటింగ్  లో పాల్గొనకుండా  హైద్రాబాద్ కు తిరిగి వచ్చినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఎన్నికల ప్రచాారానికి వెళ్లబోనని కూడా ఆయన తేల్చి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios