గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గాంధీ భవన్ లో పైరవీకారులకే  పెద్దపీట వేస్తున్నారని  భవనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఆరోపించారు.  రాష్ట్రంలో పార్టీ సీనియర్లకు  అన్యాయం జరిగిందన్నారు.  ఈ విషయమై దిగ్విజయ్ విచారణ జరపాలని ఆయన కోరారు. 

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Demands Digvijay Singh  To  justice Senior leaders

హైదరాబాద్:గాంధీ భవన్ లో పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు.నల్గొండ జిల్లాలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు. .ప్రజా సమస్యలపై  అవగాహన ఉన్న నేత దిగ్విజయ్ సింగ్ అని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.హుజూరాబాద్ పరిణామాలు, తనపై వాడిన పదజాలంపై దిగ్విజయ్ సింగ్ విచారణ జరపాలని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.పార్టీ కోసం పనిచేసేవారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ఢిల్లీ పెద్దల సూచనతో  కొంతకాలంగా సైలెంట్ గా  ఉన్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వివరించారు.తెలంగాణ కాంగ్రెస్ లో  సీనియర్లకు అన్యాయం జరిగిందని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ విషయమై దిగ్విజయ్ సింగ్ విచారణ చేయాలని ఆయన కోరారు. ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానమన్నారు.

ఈ నెల  14వ తేదీన ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ నెల  15న  ప్రధాని నరేంద్రమోడీతో  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు విషయమై సీఎల్పీ నేత  మల్లుభట్టి విక్రమార్క నివాసంలో  కొందరు సీనియర్లు  సమావేశమయ్యారు.ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. త్వరలోనే కలుద్దామని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.  ఈ నెల  17న భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్లు  సమావేశమయ్యారు.ఈ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు.  సీనియర్లు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు. 

also read:మహేశ్వర్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్: కాంగ్రెస్ సీనియర్ల సమావేశం వాయిదా

టీపీసీసీ కమిటీల విషయంలో  ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు  ప్రాధాన్యత లేదని  సినియర్లు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీని వీడి కాంగ్రెస్ లో  చేరిన  నేతలు ఈ నెల  18న తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.  కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి సీనియర్లు దూరంగా ఉన్నారు. ఇవాళ  జరగాల్సిన సీనియర్ల సమావేశం వాయిదా పడింది. పార్టీలో  చోటు చేసుకున్న పరిణామాలను చక్కదిద్దేందుకుగాను  దిగ్విజయ్ సింగ్ ను ఎఐసీసీ  పరిశీలకుడిగా నియమించింది.  దిగ్విజయ్ సింగ్  సూచనతో సీనియర్లు  ఇవాళ సమావేశాన్ని వాయిదా వేశారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జుున ఖర్గే, కేసీ వేణుగోపాల్,  దిగ్విజయ్ సింగ్ లు  రాష్ట్రానికి చెందిన  పలువురు పార్టీ నేతలతో ఇవాళ ఫోన్ లో మాట్లాడారు.   పార్టీలో చోటు  చేసుకున్న సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేశారు.  ఈ ఫోన్లతో సీనియర్లు కొంత చల్లబడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios