వరదల విషయమై చర్చించా: కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీపై కోమటిరెడ్డి
తెలంగాణలో వచ్చిన వరదల విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించినట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.వరదల జరిగిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాలని కూడా తాను కోరినట్టుగా చెప్పారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో వచ్చిన వరదల విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చించినట్టుగా భువనగిరి ఎంపీ Komatireddy Venkat Reddy ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shahతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం నాడు భేటీ అయ్యారు.కేంద్ర హోంశాఖ మంత్రితో కోమటిరెడ్డి బ్రదర్స్ వేర్వేరుగా భేటీ అయ్యారు. Telangana రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో రూ. 1400 కోట్ల నష్టం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
అంతేకాదు రాష్ట్రానికి జరిగిన సహాయం చేయాలని కూడా కోరారు. అంతేకాదు తెలంగాణలో ఏరియల్ సర్వే చేయాలని కూడా అమిత్ షాను కోరినట్టుగా ఆయన వివరించారు. ఇవాళ ఉదయం నుండి మూడు ముఖ్యమైన సమావేశాలకు హాజరైనట్టుగా చెప్పారు. ఈ సమావేశాలకు హాజరుకాకపోతే రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగేదన్నారు.
also read:నన్ను కూడా పార్టీ నుండి పంపే ప్రయత్నం: రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
ప్రజల సమస్యలపై తాను నిరంతరం పనిచేస్తున్నట్టుగా చెప్పారు. తనకు బెస్ట్ ఎంపీ అవార్డు వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన సమస్యలపై తాను ఇవాళ కేంద్ర మంత్రులతో కలిసినట్టుగా చెప్పారు. హైద్రాబాద్- విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని కూడా తాను కేంద్ర మంత్రులను కోరినట్టుగా చెప్పారు.