రూ.10 లక్షలకు అఖిలప్రియ ఒప్పందం: అరెస్టయిన నిందితులు వీరే..

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రదాన నిందితురాలు భూమా అఖిలప్రియనే అని పోలీసులు తేల్చారు. కిడ్నాప్ కోసం రూ.10 లక్షలకు ఆమె ఒప్పందం చేసుకున్నారు. అరెస్టయిన 19 మందిలో అత్యధికులు కృష్ణా జిల్లాకు చెందినవారే.

Bhuma Akhilapriya made agreement for Rs 10 lkahs to kidnap Praveen Rao and others

హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు టీడీపీ నేత భూమా అఖిలప్రియేనని పోలీసుుల నిర్ధారించారు. కిడ్నాప్ సమయంలో ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ వెల్లడించారు. కిడ్నాప్ కోసం అఖిలప్రియ రూ.10 లక్షలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. 

ప్రవీణ్ రావు, ఆయన సోదరుల కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 19 మందిని అరెస్టు చేసారు. బార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్ ల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. 

కిడ్నాప్ పథకాన్ని అమలు చేయడానికి 20 మంది యువకులను సమకూర్చాలని గుంటూరు శ్రీను మాదాల సిద్దార్థను కోరాడు. రూ. 5 లక్షలు కిడ్నాప్ నకు, ఒక్కో యువకుడికి రూ.25 వేల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.74 వేలు అడ్వాన్స్ గా కూడా చెల్లించారు. వారందరికీ కూకట్ పల్లి ఫోరం మాల్ సమీపంలోని ఎట్ హోం లాడ్జిలో బస కల్పించారు. 

యువకుల వేషాలకు అవసరమైన దుస్తులు కుట్టించారు. మల్లికార్జున్ రెడ్డి, సంపత్ లతో కలిసి ఆరు చౌకరకం సెల్ ఫోన్లు, బొమ్మ తుపాకీ, తాడు, ప్లాస్టర్లు, తదితర వస్తువులు కొన్నారు. బార్గవ్ రామ్ 10 స్టాంపు కాగితాలను తెప్పించాడు. ఐదు తన పేర, మిగతావి జగత్ విఖ్యాత్ రెడ్డి పేర కొనుగోలు చేశాడు. 

ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం నుంచే సంపత్, బాల చెన్నయ్య టూవీలర్ మీద మనోవికాస్ నగర్ లోని బాధితుల ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. నిందితులందరూ సాయంత్రం 4 గంటలకు లాడ్జి నుంచి యూసుఫ్ గుడాలోని ఎంజీహెచ్ పాఠశాలకు చేరుకున్నారు. ఐటి అధికారుల మాదిరిగా దుస్తులు ధరించారు ప్రవీణ్ రావు ఇంట్లోకి చొరబడి మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు లాక్కుని వారిని హాల్లో కూర్చోబెట్టారు. 

ప్రవీణ్ రావు, నవీన్ కుమార్, సునీల్ కుమార్ ల కళ్లకు గంతలు కట్టి చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఒక్కొక్కరిని కారులో ఎక్కించారు. మొయినాబాద్ లోని భార్గవ్ రామ్ గెస్ట్ హౌస్ కు తీసుకుని వెళ్లారు. అక్కడ కొట్టి బెదిరించి స్టాంపు కాగితాలపై చేయించుకున్నారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో బాధితులను వదిలేసి పారిపోయారు. 

కిడ్నాప్ కోసం మొత్తం ఐదు కార్లను వాడారు. కాగితంపై నకిలీ నెంబర్లను ప్రింట్ చేసి అన్ని కార్లకు అతికించారు. ఏపీ 21సీకే2804 ఇన్నోవాకు, టీఎస్ 09 బిజడ్ 9538 అనే నకిలీ నెంబర్లు తగిలించారు. ఆ కారును జగత్ విఖ్యాత్ రెడ్డి నడిపాడు. భార్గవ్ రామ్ తో సహా నలుగురు నిందితులు అందులోనే ఉన్నారు. ఆ కారు భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి పేరున రిజిష్టర్ అయి ఉంది. మరో 4 వాహనాలకు నకిలీ నెంబర్లు అతికించి మిగతావారు వాటిలో వెళ్లారు.

ఇప్పటి వరకు అరెస్టయిన నిందితులు వీరే.... 

తాజాగా అరెస్టయినవారు అత్యధికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందినవారే. మాదాల సిద్ధార్థ (29), బొజ్జగాని దేవప్రసాద్ (24), మొగలి భాను (25), రాగోలు అంజయ్య (29), పదిర రవిచంద్ర (24), పచిగల్లి రాజా అలియాస్ చంటి (28), బానోతు సాయి (23), దేవరకొండ కృష్ణవంశీ (24), దేవరకొండ కృష్ణసాయి (24), దేవరకొండ నాగరాజు (25), బొజ్జగాని సాయి (23), కందుల శివప్రసాద్ (27), మీసాల శ్రీను (28), అన్నేపాక ప్రకాష్ (20), షేక్ దావూద్ 31). 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios