హైదరాబాద్:  బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్  సోమవారం నాడు సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

బోయిన్ పల్లి కిడ్నాప్ జరిగిన నుండి భార్గవ్ రామ్  పరారీలో ఉన్నాడు. భార్గవ్ రామ్ తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డి, చంద్రహాస్, గుంటూరు శ్రీను, భార్గవ్ రామ్ కుటుంబసభ్యులు  పోలీసులకు చిక్కకుండా ఉన్నారు.

ఈ నెల 5వ తేదీన బోయిన్‌పల్లిలో  ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులు కిడ్నాపయ్యారు. ఈ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సహా మరో 19 మంది అరెస్టయ్యారు. ఇంకా ఈ కేసులో భార్గవ్ రామ్ సహా ఇంకా 9 మంది పరారీలో ఉన్నారు. 

also read:అఖిలప్రియకు మరోసారి చుక్కెదురు: బెయిల్ తిరస్కరించిన కోర్టు

పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ సమయంలో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న భార్గవ్ రామ్ కోసం పోలీస్ బృందాలు విస్తృతంగా  గాలింపు చర్యలు చేపట్టారు. 

అయితే ఈ సమయంలో భార్గవ్ రామ్ సోమవారం నాడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సికింద్రాబాద్ కోర్టు విచారించింది. విచారణను ఈ నెల 21 వతేదీకి వాయిదా వేసింది కోర్టు.