2017లో సంచలనం సృష్టించిన నరేష్, స్వాతి పరువు హత్య కేసులో యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది.
2017లో సంచలనం సృష్టించిన నరేష్, స్వాతి పరువు హత్య కేసులో యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా వున్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, నల్ల సత్తిరెడ్డిలను కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 9న ప్రాసిక్యూషన్ , డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో 2018 జూలై 31న పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 23 మంది సాక్షుల విచారణతో పాటు భౌతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్ట్ నిందితులను దోషులుగా ప్రకటించింది.
