భారత్ జోడో యాత్రకు బ్రేక్: ఢిల్లీకి బయలుదేరిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రకు బ్రేక్ పడింది. దీపావళిని పురస్కరించుకొని ఇవాళ మధ్యాహ్నం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
హైదరాబాద్: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం నాడు ముగిసింది. కర్ణాటక రాష్ట్రం నుండి పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర నాలుగు కి.మీ. సాగింది. నాలుగు కి.మీ. పాదయాత్ర చేసిన తర్వాత రాహుల్ గాంధీ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. పాదయాత్రను ముగించుకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు బయలుదేరారు. మక్తల్ నియోజకవర్గంనుండి రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి విమానంలో ఢిల్లీకి చేరకుంటారు. ఈ నెల 24, 25 , 26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించనున్నారు.
also read:తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు..
ఇవాళ ఉదయం కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు జిల్లాలోని ఎర్మారస్ నుండి నారాయణపేట జిల్లాలోని గూడబల్లూరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తదితరులు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. మొదటి రోజున రాహుల్ గాంధీ నాలుగు కి.మీ పాదయాత్ర నిర్వహించారు. నాలుగు కి.మీ పాదయాత్ర ముగించిన తర్వాత రాహలు్ గాంధీ తన యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలు దేరారు. ఈ నెల 24,25 , 26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 26న ఎఐసీసీ చీఫ్ గా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుండి మక్తల్ చేరుకుంటారు. ఈ నెల 27 నుండి రాహుల్ గాంధీ పాదయాత్రను పున: ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. తమిళనాడు,కేరళ, ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక రాష్ట్రాల మీదుగా పాదయాత్ర ముగిసింది. ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో 12 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ఈ 12 రోజుల్లో 19 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిల్లో యాత్ర సాగనుంది. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలు తీసుుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైద్రాబాద్ , మెదక్ జిల్లాల మీదుగా మహారాష్ట్రలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.
కన్యాకుమారి నుండి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముగియనుంది. దేశంలోని ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ యాత్ర ద్వాారా నిస్తేజంగా ఉన్న పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.