కరోనాకు వ్యాక్సిన్: థామస్ జెపర్సన్ యూనివర్సిటీతో భారత్ బయోటెక్ ఒప్పందం

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు మందు కనుగొనాలని అన్ని దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన భారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ సంయుక్తంగా ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి

Bharat Biotech, Thomas Jefferson University pursue a promising vaccine candidate against COVID-19

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు మందు కనుగొనాలని అన్ని దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన భారత్ బయోటెక్, థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ సంయుక్తంగా ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ఇది నిష్క్రియం చేయబడిన రాబిస్ వ్యాక్సిన్‌గా పరిశోధకులు తెలిపారు.

బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేస్తుందని, పిల్లలు, గర్బిణీ స్త్రీలతో సహా ఎవరికైనా ఇది సరిపోతుందని వారు చెప్పారు. అంటు వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ మాథియాస్ ష్నెల్‌ ప్రయోగశాలలో ఈ ఏడాది జనవరిలో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.

ఇటీవల జంతువులపై జరిపిన ప్రాథమిక పరీక్షల్లో.. ఎలుకలలో బలమైన యాంటీబాడీ ప్రతిస్పందన చూపించిందది. టీకాలు వేసిన జంతువులు కరోనా నుంచి బయటపడ్డాయో వచ్చే నెలలో తెలియనుంది.

Also Read:తెలంగాణ కాస్త తెరిపినిచ్చిన కరోనా: కొత్తగా 27 కేసులు, 1,661కి చేరిన సంఖ్య

భారత్ బయోటెక్‌తో మా భాగస్వామ్యం తర్వాతి దశల అభివృద్ధి ద్వారా వ్యాక్సిన్‌ తయారీని వేగవంతం చేస్తుందని జెఫర్సెన్ వ్యాక్సిన్ ఇన్‌స్టిట్యూట్‌కు నేతృత్వం వహిస్తున్న ష్నెల్ తెలిపారు.

భారత్ బయోటిక్ సీఈవో డాక్టర్ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. సమర్థవంతమైన వ్యాక్సిన్ కోసం డిమాండ్ ఉన్న దృష్ట్యా.. క్రియారహిత రాబిస్ వెక్టర్‌ను ఉపయోగించి కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

థామస్ జెఫర్సన్ వర్సిటీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని కృష్ణమోహన్ వెల్లడించారు. తమ సంస్థ ప్రపంచ ఆరోగ్యానికి కట్టుబడి ఉందని.. వాణిజ్య లైసెన్స్‌ను సాధించడానికి సమగ్ర క్లినికల్ ట్రయల్స్‌తో సహా టీకా అభివృద్దిని చేపడతామని ఆయన చెప్పారు.

Also Read:కరోనా హాట్‌స్పాట్‌గా భారత్: ప్రెస్‌మీట్లకు రాని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, విమర్శలు

లైసెన్స్ ఒప్పందం ప్రకారం.. జెఫర్సన్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేయడానికి, మార్కెట్ చేయడానికి భారత్  బయోటెక్‌ ప్రత్యేక హక్కులను పొందుతుంది. భారత ప్రభుత్వ బయో టెక్నాలజీ విభాగం సహకారంతో 2020 డిసెంబర్ నాటికి హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించే స్థితికి రావాలని భారత్ బయోటెక్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంస్థ ప్రపంచంలోనే రాబిస్ వ్యాక్సిన్‌ సరఫరాలో అగ్రస్థానంలో ఉంది. భారత్ బయోటెక్ 100కు పైగా గ్లోబల్ పేటెంట్లతో, 16కి పైగా ఉత్పత్తులతో, 70కి పైగా దేశాలలో రిజిస్ట్రేషన్లు, డబ్ల్యూహెచ్ఓ ప్రీ క్వాలిఫికేషన్‌లతో ఘనమైన చరిత్ర ఉంది.

ఇప్పటికే 4 బిలియన్లకు పైగా వ్యాక్సిన్లను ఈ సంస్థ ప్రపంచానికి పంపిణీ చేసింది. హెచ్ 1 ఎన్ 1, రోటావైరస్, జపనీస్ ఎన్సె‌ఫాలిటిస్, టైఫాయిడ్, చికెన్ గున్యా, జికా కోసం భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల‌ను అభివృద్ధి చేస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios