హైదరాబాద్: భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా తొలి విడత డోసులు బుధవారం నాడు హైద్రాబాద్ నుండి దేశంలోని 11 నగరాలకు బయలుదేరాయి.

55 లక్షల కోవాగ్జిన్ డోసులు దేశంలోని పలు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. ఢిల్లీ, పాట్నా, లక్నో, జైపూర్, చెన్నై, బెంగుళూరు, విజయవాడ, గౌహతి, పుణె, కురుక్షేత్ర, భువనేశ్వర్  లకు టీకా డోసులు తరలించనున్నారు.

వీరిలో 38.5 లక్షల డోసులను కేంద్రం కొనుగోలు చేసింది. 16.5 లక్షల డోసులను భారత్ బయోటెక్ ఉచితంగా అందిస్తోంది. ఎయిరిండియా విమానం ఏఐ 559 విమానంలో బుధవారం నాడు ఉదయం కోవాగ్జిన్ టీకాలు బయలుదేరాయి.

మంగళవారం నాడు ఆర్‌జీఎస్ఎస్‌హెచ్ 2.64 లక్షల కోవిషీల్డ్ టీకాలను సేకరించి టీకాలను భద్రపరిచింది.ఈ నెల 16వ తేదీ నుండి దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.ఇందులో భాగంగా కరోనా వ్యాక్సిన్ ను దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.