భద్రకాళీ ఫైర్ వర్క్స్‌: చనిపోయిన 11 మంది వీరే (వీడియో)

Bhadrakali fire works: Here is death list, 11 dead, 21 injured
Highlights

భద్రకాళీ ఫైర్ వర్క్స్‌: చనిపోయిన 11 మంది వీరే (వీడియో)


వరంగల్‌: వరంగల్ భద్రకాళీ ఫైర్‌ వర్క్స్‌లో బుధవారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. మరో 21 మంది గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని  అధికారులు ప్రకటించారు.

వరంగల్‌‌లోకి కోటి లింగాల భద్రకాళీ ఫైర్ వర్క్స్‌లో  జరిగిన అగ్ని ప్రమాదంలో  ఇప్పటివరకు 11 మంది మృత్యువాత పడ్డారు. వినోద్‌, రాధిక, ఎల్లమ్మ, అశోక్‌, రఘుపతి, కనకరాజు, శ్రీవాణి, శ్రావణి, మణెమ్మ, హరికృష్ణ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కొండకట్ల శ్రీదేవి అనే మహిళ ఎంజీఎంలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది. 

ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల ఇల్లు కూడ దెబ్బతిన్నాయి. రెండు కిలోమటర్ల దూరం పాటు శబ్దం విన్పించింది.  ఫ్యాక్టరీ సమీపంలోని ద్విచక్రవాహనాలు కూడ ధ్వంసమయ్యాయి. వివాహం కోసం బాణాసంచా తీసుకెళ్లేందుకు వచ్చిన వారు కూడ  తీవ్రంగా గాయపడ్డారు. కారులో కూర్చోవడంతో ప్రాణాలతో మిగిలారు. కారు పూర్తిగా ధ్వంసమైంది.  కారులో ఉన్న వారు గాయపడ్డారు.

భవనం శిథిలాల కింద కూడ పలువురు ఉండి ఉండొచ్చనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి. జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ప్రతి రోజూ ఈ ఫ్యాక్టరీలో సుమారు 25 నుండి 30 మంది పనిచేస్తారని స్థానికులు చెబుతున్నారు.
 

loader