ఫ్యామిలీతో కలిసి రేవంత్‌ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే .. ఏం జరుగుతోంది.?

బీఆర్ఎస్ నేత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వెంకట్రావు.. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వున్నారు.

bhadrachalam brs mla tellam venkata rao meets telangana cm revanth reddy ksp

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు , రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌లు సీఎంతో భేటీ అయ్యారు. తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయనను కలిశామని వారు చెబుతున్నప్పటికీ.. రాజకీయ కారణాలు వున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ సీనియర్ నేత, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ .. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. 

తాజాగా బీఆర్ఎస్ నేత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వెంకట్రావు.. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొత్తల్లోనే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరిగింది.

తర్వాత కొద్దికాలం సైలెంట్ అయిన తెల్లం.. తాజాగా ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు కనుక తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరితే.. ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి ప్రాతినిథ్యం లేనట్లే. మరి తెల్లం హస్తం తీర్ధం పుచ్చుకుంటారో లేక ఇది మర్యాదపూర్వక భేటీ అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios