Asianet News TeluguAsianet News Telugu

రాజ‌కీయ ప‌ర్యాట‌కుల‌తో జాగ్ర‌త్త : కాంగ్రెస్, బీజేపీల‌పై కేసీఆర్ విమ‌ర్శ‌లు

angana Assembly Elections 2023: ''కాంగ్రెస్ పాలనలో ప్రజలు తాగు, సాగునీరు లేక ఇబ్బందులు పడ్డారు. కరెంటు కోతలతో పొలాలకు నీరందించేందుకు రాత్రులు వెచ్చించి పాముకాటుకు గురై అనేక మంది రైతులు చనిపోయారు. పశువుల కాపరులు దాణా లేక తమ ఆవులను కబేళాలకు అమ్ముకోవాల్సి వచ్చిందని'' కేసీఆర్ గుర్తుచేశారు. 
 

Beware of political tourists: KCR criticises Congress, BJP RMA
Author
First Published Nov 15, 2023, 5:38 AM IST

Telangana Elections 2023: తప్పుడు వాగ్దానాలతో విమానాల్లో వచ్చే రాజకీయ పర్యాటకుల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలని , నిత్యం ప్రజల్లో ఉండే బీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పిలుపునిచ్చారు. ''విమానాలలో వచ్చే వారు మీకు పట్టాభిషేకం చేస్తారనీ, మీకు మెరుగైన పాల‌న అందిస్తార‌ని భావిస్తున్నారా? తప్పుడు వాగ్దానాలతో మిమ్మల్ని మోసం చేసి ఇంటికి చేరుకుంటారు. దానికి బదులు విజ్ఞులైన పౌరులుగా ఉండి మీ మధ్య ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేయండి' అని పాలకుర్తి, హాలియా (నాగార్జున సాగర్) , ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ అన్నారు. 

బీఆర్‌ఎస్ అధికారంలోకి వ‌స్తే దశలవారీగా గిరిజన బంధును అమ‌లు చేస్తామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. ''కాంగ్రెస్‌ హయాంలో ప్రజలు తాగు, సాగునీరు అందక ప్రజలు పడ్డ కష్టాలను గుర్తుచేస్తూ, కరెంటు కోతలతో పొలాలకు నీళ్లిచ్చేందుకు రాత్రులు గడుపుతున్న రైతులు పాముకాటుకు గురై చనిపోయారు. అయితే, బీఆర్‌ఎస్‌ పాలనలో పరిస్థితి మారిందని అన్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. వ్యవసాయ పనులు, ఇతర రంగాల్లో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు వస్తున్నారని అన్నారు. బహుళ సంక్షేమ పథకాలను అమలు చేయడం, రైతులకు వారి భూములపై ​​పూర్తి అధికారం ఇచ్చామ‌ని తెలిపారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని హ‌క్కులు ప్ర‌జ‌ల‌కు అందించింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఆ అధికారాన్ని ప్రజల నుండి లాక్కుంటారని అన్నారు. ప్రజలు మళ్లీ అంధకారంలోకి నెట్టబడతారనీ, రాష్ట్రంలో అభివృద్ధికి ఎటువంటి సంకేతాలు కనిపించవని హెచ్చ‌రించారు. నాయకుల ప‌నితీరును, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల చరిత్రను బేరీజు వేసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరుతున్న‌ట్టు చెప్పారు. తమ ప్రభుత్వం రైతు కేంద్రంగా చేపడుతున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు బాధ్యతా రహితంగా ప్రకటనలు చేస్తూ.. వారు చేస్తున్న వ్యాఖ్య‌లు తెలంగాణలో వ్యవసాయంపై వారికి ఉన్న అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టాయని కేసీఆర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios