Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో పేకాట దందాకు బాస్ అరవింద్ అగర్వాల్.. కస్టమర్లంతా సినీ, రాజకీయ ప్రముఖులే..?

సినీ హీరో నాగశౌర్య ఫాంహౌస్‌లో పేకాట వ్యవహారం (naga shourya farm house case) మరిచిపోకముందే హైదరాబాద్ బేగంపేట్‌లో (begumpet) క్యాసినో దందా వెలుగులోకి (casinos in hyderabad) రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని పేకాట దందా మొత్తాన్ని అరవింద్ అగర్వాల్ (arvind agarwal) అనే వ్యక్తి శాసిస్తున్నట్లుగా తేల్చారు. 

begumpet gambling case who is arvind agarwal
Author
Hyderabad, First Published Nov 6, 2021, 3:47 PM IST

సినీ హీరో నాగశౌర్య ఫాంహౌస్‌లో పేకాట వ్యవహారం (naga shourya farm house case) మరిచిపోకముందే హైదరాబాద్ బేగంపేట్‌లో (begumpet) క్యాసినో దందా వెలుగులోకి (casinos in hyderabad) రావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక కీలక విషయాలను రాబడుతున్నారు. హైదరాబాద్ నగరంలోని పేకాట దందా మొత్తాన్ని అరవింద్ అగర్వాల్ (arvind agarwal) అనే వ్యక్తి శాసిస్తున్నట్లుగా తేల్చారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులతో పరిచయాలు వున్నట్లుగా తెలుస్తోంది. క్యాసినో, పోకర్, పేకట, తీన్‌పత్తాలను అరవింద్ అగర్వాల్ ఆడిస్తున్నాడు. 

అరవింద్ కస్టమర్లలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులే వున్నారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులతో అరవింద్ అగర్వాల్‌కు సంబంధాలు వున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. అటు సినీ ప్రముఖులతో కూడా అగర్వాల్‌కు లింకులు వున్నట్లుగా తెలుస్తోంది. పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కినా బాధ్యత తనదేనంటూ అగర్వాల్ తన కస్టమర్లకు భరోసా ఇచ్చేవాడని పోలీసులు చెబుతున్నారు. గోవా, సింగపూర్, శ్రీలంకలకు వీఐపీలను తీసుకెళ్లి కోట్లాది రూపాయలతో అరవింద్ క్యాసినో ఆడిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. 

ALso Read:హైదరాబాద్‌: బట్టబయలైన మరో పేకాట కేంద్రం ... గెస్ట్‌హౌస్‌లో వెలుగు చూసిన దందా

పండుగలు, ముఖ్యమైన  రోజుల్లో కోట్లాది రూపాయలు గేమ్‌లు ఆడించేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే బేగంపేట్‌లో 150 మందికి ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. ఆహ్వానం అందుకున్న వారిలో 85 మంది హాజరైనట్లుగా సమాచారం. స్థానికులు దీనిపై సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్ ఈ స్థావరంపై దాడులు చేసింది. బేగంపేట అడ్డాపై టాస్క్‌ఫోర్స్ దాడి తర్వాత ఓ ప్రముఖ నాయకుడు రంగ ప్రవేశం చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు చాలామందిని పట్టుకుని తీసుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. అలాగే కోట్లాది రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అయితే కేవంల ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసినట్లు చూపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios