బ్యూటీషియన్ శిరీష మృతి కేసులో మరో మలుపు. ఆమె ఆత్మహత్యకు కారకులైన ఎ1 శ్రావన్, ఎ2 రాజీవ్ లకు బెయిల్ నిరాకరించింది న్యాయస్తానం. దీంతో వారు మరికొన్ని రోజులు జైలులో చిప్పకూడు తినాల్సిందే.

 

శిరీష కేసులో ఇద్దరు నిందితులు ప్రస్తుతం జైలులో అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు. వారు తమకు బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఇప్పుడే బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో న్యాయస్థానం బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ ఆదేశాలిచ్చింది.