న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ జాగ్రత్త.. తాగి బండి నడిపితే జైలుకే..
New year celebrations : న్యూ ఇయర్ వేడుకులను అందరూ సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. తాగి వాహనాలు నడిపితే ఫైన్ విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరంగా వాహనాలు నడిపినా, ఇతరులకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పాల్పడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
New year celebrations : 2023 సంవత్సరం నేటితో ముగిసిపోనుంది. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రానుంది. దీంతో దేశమంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు సిద్ధమవుతోంది. యువత 2024కు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పాలని ప్లాన్ చేసుకుంటోంది. అందులో భాగంగా పార్టీలు చేసుకునేందుకు, కేక్ కటింగ్స్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ న్యూయర్ వేడుకల్లో ఎలాంటి అపశృతీ జరకుండా చూసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగారు.
రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..
న్యూ ఇయర్ వేళ ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు న్యూయర్ వేడుకల సమయంలో పలు ఆంక్షలు విధించారు. తాగి వాహనాలు నడపకూడదని సూచిస్తున్నారు. మద్యం సేవించి రోడ్లపై తిరగకూడదని చెబుతున్నారు. అర్థరాత్రి ఒంటి గంట దాటిన తరువాత కూడా వేడుకలు కొనసాగిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
భారత్ లో కోవిడ్ పంజా.. ఒక్క రోజే 841 కేసులు నమోదు.. 7 నెలల్లోనే అత్యధికం..
ఈ విషయంలో ఇప్పటికే డీజీపీ ఆఫీస్ అన్ని పోలీస్ స్టేషన్ లను అలెర్ట్ చేసింది. ఈ న్యూయర్ వేడుకలు సజావుగా సాగాలనే ఉద్దేశంతో ఆదివారం రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేయనున్నారు. దీంతో పాటు రూ,10 వేల ఫైన్ వేసి, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. దీని కోసం ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ చెక్ పాయింట్లలలో నేటి రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. అలాగే న్యూయర్ వేడుకల సమయంలో ర్యాష్, ఓవర్ స్పీడ్ గా బండి నడపడం, మితిమీరిన శబ్దాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే వారిపై పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. టూ వీలర్ పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం, వాహనాన్ని ప్రమాదకంగా నడిపినా చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ వేడుకలు సురక్షితంగా, ఆనందంగా జరపుకోవాలని, ఈ విషయంలో అందరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.