Asianet News TeluguAsianet News Telugu

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన: పరామర్శకు వెళ్తున్న ఎంపీ సోయం బాపురావు అరెస్ట్

ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. 

Adilabad MP Soyam Bapu Rao Arrested At Manmad Village
Author
Hyderabad, First Published Jul 31, 2022, 11:28 AM IST

నిర్మల్: ఆందోళన చేస్తున్న Basara IIIT విద్యార్ధులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లే మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఉమ్మడి Adilabad  జిల్లాలోని 
దిల్వార్ పూర్ టోల్ ప్లాజాలో దగ్గర వాహనాల తనిఖీలు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వైపునకు రాజకీయ పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.లోకేశ్వరం మండలం మన్మధ దగ్గర ఎంపీ  Soyam Bapu Rao ను పోలీసులు  అరెస్ట్ చేశారు. 

బాసర ట్రిపుల్ ఐటీ వైపునకు వెళ్లే మార్గంలో చెక్ పోస్టుల వద్ద పోలీసులు  తనిఖీలు చేశారు.  ఎంపీ బాపురావును బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లొద్దని సూచించారు. అయితే  పోలీసుల సూచనను ఎంపీ బాపురావు పట్టించుకోలేదు. బాసర ట్రిపుల్ ఐటీ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నెల 16వ తేదీన బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్ అయింది. దీంతో విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.పుడ్ పాయిజన్ కారణంగా ఓ విద్యార్ధి మరణించాడు. మరో విద్యార్ధి ఇంకా కోలుకోలేదు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.

also read:బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధుల ఆందోళన: శనివారం రాత్రి నుండి మెస్ లో బైఠాయించి నిరసన

ఈ విషయమై అధికారులకు డెడ్ లైన్ విధించారు. కానీ ఈ డెడ్ లైన్ ముగిసింది.కానీ తమ డిమాండ్లను పరిష్కరించలేదని  విద్యార్ధులు ఆందోళనకు దిగారు. శనివారం నాడు రాత్రి నుండి మెస్ లోనే బైఠాయించి నిరసన చేపట్టారు. సుమారు మూడు వేల మంది విద్యార్ధులు  ఆందోళనలో పాల్గొన్నారు. ప్రస్తుతమున్న మెస్ కాంట్రాక్టర్ ను మార్చి కొత్తవారిని తీసుకోవాలంటే సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కొత్త మెస్ కాంట్రాక్టర్ ను అపాయింట్ చేయడానికి  సమయం పడుతుందని ఇంచార్జీ వీసీ విద్యార్ధులకు తెలిపాడు. అయితే విద్యార్ధులు మాత్రం మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని ఆందోళనకు దిగారు. 

ఈ1, ఈ2 విద్యార్ధులు ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తున్నారు.  ఈ 3 విద్యార్ధులకు సెలవులు పూర్తయ్యాయి. ఈ 3 విద్యార్ధులు ఇవాళ్టి నుండి బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చే అవకాశం ఉంది.ఈ 3 విద్యార్ధులు కూడా వీరికి తోడైతే ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.ఇదిలా ఉంటే ఇవాళ ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులతో బాసర ట్రిపుల్ ఐటీ  ఇంచార్జీ వీసీ  చర్చలు జరిపే అవకాశం ఉంది. నిన్న రాత్రి కూడా విద్యార్ధులు భోజనం మానేశారు. ఇవాళ ఉదయం కూడా విద్యార్ధులు టిఫిన్ చేయలేదు. ఇవాళ మధ్యాహ్నం కూడా విద్యార్ధులు భోజనం మానేస్తే విద్యార్ధుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది.

ఈ ఏడాది జూన్ మాసంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు వారం రోజుల పాటు ఆందోళన నిర్వహించారు.  జూన్ 20వ తేదీన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్ధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో జూన్ 21వ తేదీ నుండి విద్యార్ధులు క్లాసులకు హాజరయ్యారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios