Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్: బిల్లు విషయంలో గొడవ.. కస్టమర్లను బయటకి ఈడ్చుకొచ్చి చితకబాదిన బార్ సిబ్బంది

హైదరాబాద్‌లోని (hyderabad) పబ్బులు, క్లబ్బులు ఇటీవలికాలంలో తరచుగా వివాదాల్లో నిలుస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లోని (rajendra nagar) భవానీ రెస్టారెంట్ అండ్ బార్ యాజమాన్యం (bhavani bar and restaurant) రెచ్చిపోయింది

bar and restaurant staff attack on customers in rajendra nagar
Author
Hyderabad, First Published Oct 13, 2021, 9:56 PM IST

హైదరాబాద్‌లోని (hyderabad) పబ్బులు, క్లబ్బులు ఇటీవలికాలంలో తరచుగా వివాదాల్లో నిలుస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లోని (rajendra nagar) భవానీ రెస్టారెంట్ అండ్ బార్ యాజమాన్యం (bhavani bar and restaurant) రెచ్చిపోయింది. బార్‌కొచ్చిన కస్టమర్లను యాజమాన్యం చితకబాదింది. రెస్టారెంట్‌ బిల్లు చెల్లింపు విషయంలో చోటు చేసుకున్న వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కస్టమర్లపై వీధి రౌడిల్లా ప్రతాపం చూపింది యాజమాన్యం. కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు యువకులు. 

ఈ ఘటనలో ముగ్గురు కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడటంతో పాటు కొట్టుకుంటూ వారిని నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాజేంద్ర నగర్ పోలీసులు (rajendra nagar police)ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బార్‌లో ఎలాంటి గొడవ జరగలేదని బార్ సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేశారు. బార్ బయటే ఇరు వర్గాలు కొట్టుకున్నారంటూ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. 

ALso Read:హైదరాబాద్: పబ్‌లో ప్రత్యక్షమైన చిన్నారి.. సీపీ, డీజీపీ, మీడియాకు వీడియో పంపిన నెటిజన్

కాగా, కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ పబ్ ఏకంగా చిన్నారిని అనుమతించడం కలకలం రేపింది. గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ బాలిక ప్రత్యక్షమైంది. ఈ వీడియోను రికార్డ్ చేసిన ఓ యువకుడు సైబరాబాద్ సీపీ, డీజీపీ, మీడియా ఛానెళ్లకు ట్యాగ్ చేశాడు. పబ్‌లో ఈ చిన్నారికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో పబ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చిన్నారిని పబ్‌కు తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎవరా అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios