18 ఏళ్లు నిండని వారికి వైన్ షాపులో మద్యమే అమ్మరు. అలాంటిది హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ బాలిక ప్రత్యక్షమైంది. ఈ వీడియోను రికార్డ్ చేసిన ఓ యువకుడు సైబరాబాద్ సీపీ, డీజీపీ, మీడియా ఛానెళ్లకు ట్యాగ్ చేశాడు. పబ్‌లో ఈ చిన్నారికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు.

18 ఏళ్లు నిండని వారికి వైన్ షాపులో మద్యమే అమ్మరు. అలాంటిది హైదరాబాద్‌లోని ఓ పబ్ ఏకంగా ఓ చిన్నారిని అనుమతించింది. పీకలదాకా తాగి విచ్చలవిడిగా చిందులు వేసే పబ్‌లో ఓ బాలికను అనుమతించడం నగరంలో దుమారం రేపుతోంది. గచ్చిబౌలిలోని లాల్‌స్ట్రీట్ పబ్‌లో ఓ బాలిక ప్రత్యక్షమైంది. ఈ వీడియోను రికార్డ్ చేసిన ఓ యువకుడు సైబరాబాద్ సీపీ, డీజీపీ, మీడియా ఛానెళ్లకు ట్యాగ్ చేశాడు. పబ్‌లో ఈ చిన్నారికి ఏమైనా అయితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ట్వీట్ కాస్తా వైరల్ కావడంతో పబ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు.. చిన్నారిని పబ్‌కు తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎవరా అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.