Asianet News TeluguAsianet News Telugu

తెలుగు అకాడమీ కుంభకోణం: సీసీఎస్ ఎదుట విచారణకు హాజరైన బ్యాంక్ సిబ్బంది

తెలుగు  రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

bank staff attend for ccs enquiry in telugu academy scam
Author
Hyderabad, First Published Oct 3, 2021, 7:12 PM IST

తెలుగు  రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణం కేసులో తెలుగు అకాడమీ, కెనరా బ్యాంక్ సిబ్బంది సీసీఎస్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రఫిక్, రాజ్‌కుమార్‌ల సంబంధాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల డిపాజిట్ గల్లంతుపై పోలీసులు విచారిస్తున్నారు. యూనియన్, కెనరా బ్యాంక్‌ల నుంచి రూ.8 కోట్లను మస్తాన్ గ్యాంగ్ కాజేసింది. అదే సమయంలో తెలుగు అకాడమీ సిబ్బందిని సైతం సీసీఎస్ పోలీసులు  ప్రశ్నిస్తున్నారు. రఫీ, రాజ్‌కుమార్‌లతో జరిపిన లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే అకాడమీ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేశ్, ఉద్యోగి రఫీక్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆఫీస్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు వారిని కోరారు

అంతకుముందు తెలుగు అకాడమీ (Telugu Akademi) మాజీ డైరెక్టర్ సోమిరెడ్డితో (somi reddy)పాటు అకౌంట్స్ అధికారిని విచారణకు హాజరు కావాలని సీసీఎస్  (ccs police) పోలీసులు ఆదివారం నోటీసులు (notice) జారీ చేశారు. తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ (fraud) వ్యవహరంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే నలుగురిని (four arrest)అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీకి చెందిన పలు బ్యాంకుల్లో  ఉన్న సుమారు రూ. 70 కోట్ల నిధులను డ్రా చేశారు నిందితులు.  ఈ విషయమై అందిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ నిర్వహించిన  సీసీఎస్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. తెలుగు అకాడమీలో నిధులు గోల్ మాల్ వ్యవహరం వెలుగు చూడడంతో డైరెక్టర్ పదవి నుండి సోమిరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది., రెండు రోజుల క్రితమే సోమిరెడ్డిని ఈ పదవి నుండి తప్పించింది.

సోమిరెడ్డితో పాటు అకౌంట్స్ విభాగం చూసే ప్రధాన అధికారిని కూడ విచారణకు రావాలని సీసీఎస్ పోలీసులు నోటీసులుఇచ్చారు.తెలుగు అకాడమీ ఉద్యోగులంతా కూడ అందుబాటులో ఉండాలని కూడ సీసీఎస్ పోలీసులు ఆదేశించారు. మస్తాన్ వలీ(mastan vali), రాజ్ కుమార్ (raj kumar)తో ఉన్న సంబంధాలపై కూడ సీసీఎస్ పోలీసులు విచారణ చేయనున్నారు.వెలుగులోకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీ తో ఉన్న ఆర్ధిక లావాదేవీలపై కూడ సీసీఎస్ పోలీసులు ఆరా తీసే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios