హైదరాబాద్: హైద్రాబాద్ పట్టణంలోని కోఠిలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి కరోనాతో సోమవారం నాడు మృతి చెందారు. దీంతో ఈ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.కోఠిలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకిందని తేలింది. కరోనాతోనే ఆయన చనిపోయినట్టుగా అధికారులు ప్రకటించారు. 

చనిపోయిన ఉద్యోగితో ఎవరెవరకు సన్నిహితంగా ఉన్నారనే విషయమై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు.  అవసరమైతే వారికి కూడ అధికారులు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

also read:తెలంగాణలో ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నేటి కేబినెట్‌లో చర్చ: రేపటి నుండి రోడ్లపైకి బస్సులు?

మరో వైపు మరో ఘటనలో పాతబస్తీకి చెందిన కరోనా రోగి ఒకరు బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసినట్టుగా ఆదివారం నాడు గుర్తించారు. ఈ బ్యాంకు సిబ్బందికి కూడ అధికారులు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. 

హైద్రాబాద్ పట్టణంలోని నాలుగు జోన్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఎల్బీనగర్, మలక్ పేట, కార్వాన్, చార్మినార్ జోన్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ జోన్లలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది.