హైద్రాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ మింక్ పబ్ వ్యవహరంపై పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్ సీఐ శివచంద్రను సస్పెండ్ చేశారు.బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో ఇచ్చారు.
హైద్రాబాద్: నగరంలోని బంజారాహిల్స్ Pudding Mink వ్యవహరంపై పోలీసు శాఖ సీరియస్ అయింది. బంజారాహిల్స్ సీఐ Shiva Chandra ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ Sudharshanన్ కు పోలీసులు చార్జ్ మెమో ఇచ్చారు. ఈ పబ్ విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందున పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు.
పుడింగ్ మింక్ పబ్ లో ఆరు గ్రాముల కొకైన్ ను పోలీసులు సీజ్ చేసుకొన్నారు. అంతేకాదు ఆదివారం నాడు తెల్లవారుజాము వరకు కూడా ఈ పబ్ నిర్వహిస్తున్న సమాచారం తెలుసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
మింక్ పబ్‌ను నిబంధనలకు విరుద్దంగా నిర్వహిస్తున్నారని పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన సమయంలో కొకైన్ ను లభ్యమైంది. బాత్‌రూమ్ లు, డ్యాన్స్ ఫోర్లలో డ్రగ్స్ ను పోలీసులు గుర్తించారు. ఇది కాకుండా ఆరు గ్రాముల సీజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఇది కొకైన్ అని ల్యాబ్ నుండి పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. అయితే పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ తో పబ్ నిర్వహిస్తున్నా కూడా పోలీసులు పట్టీ పట్టనట్టుగా వ్యవహరించారని ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకొన్నారు.
ఈ పబ్ లైసెన్స్ మాజీ ఎంపీ కూతురి పేరున ఉంది. అయితే ఆమె ఈ ఫబ్ ను ఈ ఏడాది జనవరి మాసంలోనే వేరొకరికి లీజుకు ఇచ్చినట్టుగా సమాచారం. ప్రముఖులను మాత్రమే ఈ పబ్ కి అనుమతిస్తారు. అయితే ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో ప్రముఖులే ఎక్కువగా ఈ పబ్ లో పోలీసులకు చిక్కారు. పబ్ కి వచ్చిన వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకొన్నారు, అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ పబ్ ఉన్నా కూడా ఈ పబ్ లో ఏం జరుగుతుందనే విషయమై పోలీసులు పట్టించుకోకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసే వరకు కూడా ఈ విషయమై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి పెట్టకపోవడం పోలీస్ ఉన్నతాధికారులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సీఐ శివచంద్రపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేశారు.మరో వైపు ఏసీపీ సుదర్శన్ కు మెమో ఇచ్చారు.డ్రగ్స్ ను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొంది. ఇదంతా తెలిసి కూడా బంజారాహిల్స్ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పబ్ లు నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్నారనే విషయమై గతంలో పలు ఆరోపణలు రావడంతో పోలీసు శాఖ వార్నింగ్ కూడా ఇచ్చింది. గత ఏడాది కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పబ్ నిర్వాహణ విషయమై హైకోర్టు పలు సూచనలు చేసింది. దీంతో పోలీసుల పబ్ ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు పాటించాలని సూచించారు. అయినా కూడా పబ్ యజమాను తీరులో మార్పు రాలేదని పుడింగ్ మింక్ పబ్ వ్యవహరంతో బట్టబయలైంది.
