కేసీఆర్‌పై విమర్శలు చేసే స్థాయి తనకు రాలేదని అన్నారు. కేసీఆర్ అంటే తనకు భయం లేదని స్పష్టం చేశారు. కేసిఆర్ కు భయపడి ఆయనపై విమర్శలు చేయడం లేదనే విషయంలో నిజం లేదని బండ్ల గణేశ్ అన్నారు. 

హైదరాబాద్: కాంగ్రెసులో చేరిన సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేసిఆర్ పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కేసీఆర్ మహోన్నత నేత అని ప్రశంసిస్తూ పరిపాలనాదక్షుడు కాదని ఆయన వ్యాఖ్యానించారు. వాగ్ధానాలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. 14 ఏళ్ల పోరాటం చేసి, కాంగ్రెస్ పార్టీని ఒప్పించి, పార్టీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేయించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని ఆయన అన్నారు. 

అయితే ప్రజలకు మాత్రం కేసిఆర్ చేరువలో లేరని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే స్థాయి తనకు రాలేదని అన్నారు. కేసీఆర్ అంటే తనకు భయం లేదని స్పష్టం చేశారు. కేసిఆర్ కు భయపడి ఆయనపై విమర్శలు చేయడం లేదనే విషయంలో నిజం లేదని బండ్ల గణేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.