తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో సంఘవిద్రోహా శక్తులను ఏరివేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని అన్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో సంఘవిద్రోహా శక్తులను ఏరివేయడానికి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సంఘవిద్రోహులపై సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. తెలంగాణలో పీఎఫ్‌ఐ వంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నారని.. ఎన్‌ఐఏ సోదాల్లో 11 మంది పట్టుబడ్డారని అన్నారు. 

“నేను సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడితే మతపరమైన ఇబ్బందులను రెచ్చగొట్టినట్లు నాపై ఆరోపణలు వచ్చాయి. కానీ తెలంగాణ వ్యాప్తంగా సోదాలు జరిపిన సమయంలో 11 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు?. ఈ రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది.. ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు’’ అని బండి సంజయ్ అన్నారు. 

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన అధికారాన్ని కాపాడుకునేందుకు పీఎఫ్ఐ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల సేవలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉందని విమర్శించారు. కేసీఆర్ ఏ స్థాయికైనా దిగజారతారని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం, తన అధికార పీఠాన్ని కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి రాజకీయ ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాషాయ జెండాను అవమానించిన వారిని వదిలిపెట్టబోమని ఆయన అన్నారు.

తెలంగాణలో చాలా మంది వీసాలు, పాస్‌పోర్ట్‌లు వంటి చట్టపరమైన డ్యాక్యూమెంట్లు లేకుండా పెద్ద సంఖ్యలో విదేశీయులు హైదరాబాద్‌లో ఉంటున్నారని.. తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘ వ్యతిరేకు శక్తులను బీజేపీ వదిలిపెట్టదని చెప్పారు. అయితే తమ పార్టీ ఏ ఒక్క మతానికి కూడా వ్యతిరేకం కాదని అన్నారు. 

కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే మూలాలు కోల్పోయి తెలంగాణ నుంచి విడిపోయిందని, ఆ పార్టీని సీఎం పునర్‌బ్రాండింగ్‌ చేయడంతో విడదీయాలన్నారు. చిట్టీల కంపెనీలు బోర్డు తిప్పేసినట్లు కేసీఆర్ టీఆర్ఎస్ పేరును మార్చారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే.. ఆ పార్టీకి తెలంగాణ ప్రజలతో బంధం తెగిపోయిందని అన్నారు.

హైదరాబాద్ ఎవరి సొత్తు కాదని సంజయ్ పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.