గ్రేటర్ ఎన్నికల పర్వం ముగిసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ.. టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇచ్చింది. కాగా.. ఎట్టకేలకు బీజేపీ ఎక్కువ స్థానాలే గెలుచుకుంది.కాగా.. బీజేపీ విజయానికి  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కువగా సపోర్ట్ ఇచ్చారని బండి సంజయ్ పేర్కొన్నారు. 

‘జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచి, బిజెపిని విజయతీరాలకు చేర్చిన JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారికి మరియు జన సైన్యానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ మద్దతు మా అభ్యర్థులకు గొప్ప స్థైర్యాన్ని ఇచ్చింది. మోడీ గారి నాయకత్వానికి, మాకు మీరు అందిస్తున్న సహకారం వెలగట్టలేనిది.’ అంటూ బండి సంజయ్  ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ విజయంపై పవన్ కూడా స్పందించారు. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  పోటీ చేసి ప్రజల మనసు గెలుచుకున్న బీజేపీ నేతలకు, పార్టీ అధినాయబీజేపీ తెలంగాణ అధ్యక్షునిగా మరో విజయాన్ని అందుకున్న బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ కె. లక్ష్మణ్,  బీజేపీ కార్యకర్తలకు శుభాభినందనలు తెలిపారు.

 బీజేపీ సాధించిన 48 స్థానాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న భావనకు ఒక బలమైన సంకేతమన్నారు. గెలుపునకు వ్యూహ రచనలో బీజేపీ రాష్ట్ర నాయకులు చూపిన చొరవ, తెగువ ఆ పార్టీని విజయపదాన నడిపించాయని పవన్ పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగి శ్రమకోర్చి చేసిన ప్రచారం ఈ రోజున ఫలితాన్నిచ్చిందన్నారు. బీజేపీ విజయానికి జనసైనికుల కృషి కూడా తోడవడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.