Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలతో రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ:కేసీఆర్ పై బండి సంజయ్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుటుంబంపై ఆరోపణలు రావడంతోనే  రాష్ట్రంలో కేసుల విచారణకు  సీబీఐ కి ఇచ్చిన అనుమతిని రద్దు  చేస్తూ కేసీఆర్ నిర్ణయం  తీసుకున్నారని బీజేపీ  ఆరోపించింది. మొయినాబాద్ ఎమ్మెల్యేల ప్రలోభాల కు  సంబంధించి  తమకు సంబంధం లేదని  ఆయన తేల్చి చెప్పారు.
 

Bandi Sanjay Reacts On Telangana Government Withdraw general consent To CBI
Author
First Published Oct 30, 2022, 1:15 PM IST

మునుగోడు:ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుటుంబంపై ఆరోపణలు రావడంతోనే  51 జీవోను  కేసీఆర్  సర్కార్ ఇచ్చిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.

ఆదివారంనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి లేకుండా చేస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం  తీసుకుంది. ఈ మేరకు ఈ ఏడాది ఆగస్టు 30న సీబీఐ దర్యాప్తునకు అనుమతిని నిషేధించింది. గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరిస్తూ 51 నెంబర్  జీవోను జారీ చేసింది. నిన్న హైకోర్టులో అడ్వకేట్  జనరల్ ప్రస్తావించే వరకు ఈ  జీవో  జారీ  చేసిన విషయమై తెలియదన్నారు. జీవో  జారీ చేసిన వెంటనే  ఎందుకు  పబ్లిక్ డొమైన్  లో  పెట్టలేదో చెప్పాలని బండి  సంజయ్ కేసీఆర్  ను ప్రశ్నించారు.సీబీఐ దర్యాప్తునకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

మొయినాబాద్ పాం హౌస్ విషయమై తమ పార్టీపై టీఆర్ఎస్ తప్పుడు  ప్రచారం  చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేల  ప్రలోభాల అంశంపై తమకు సంబంధం లేదని  బండి సంజయ్ ప్రకటించారు. అందుకే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన  విసయాన్ని ఆయన  గుర్తు చేశారు.యాదాద్రి ఆలయంలో  ప్రమాణానికి రావాలని తాను చేసిన సవాల్ కు కేసీఆర్  స్పందించలేదన్నారు.అయినా కూడా  తాను ఆలయంలో  ప్రమాణం  చేసిన విషయాన్ని సంజయ్  ప్రస్తావించారు.  తప్పు చేయకపోతే విచారణను కేసీఆర్ ఎందుకు  వద్దంటున్నాడని బండి సంజయ్ కోరారు. 

మొయినాబాద్ ఫాం హౌస్  ఘటన  జరిగిన రోజు నుండి నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు బయటకు రాకుండా అడ్డుకున్నారో చెప్పాలని బండి  సంజయ్  కేసీఆర్ ను ప్రశ్నించారు. రోహిత్ రెడ్డిని  పార్టీలో  చేర్చుకొనే సమయంలో ఎన్ని కోట్లు  ఇచ్చావో   మాజీ  మంత్రి మహేందర్  రెడ్డిని అడిగితే చెబుతాడన్నారు

పాలే రు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి ఎంతిచ్చారో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడిగితే చెబుతారని  బండి సంజయ్ తెలిపారు.2014 నుండి ఇప్పటివరకు 36మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారని బండి సంజయ్ చెప్పారు.తమ పార్టీలో చేరాలంటే ముందుగా తామున్న పార్టీకి, పదవులకు  రాజీనామాలు చేయాలని బండి సంజయ్ చెప్పారు.

ఇవాళ చండూరులో నిర్వహించే ఎన్నికల  సభలో కేసీఆర్ ఏడ్చి ప్రజల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తారన్నారు. స్టేజీ మీదే ఏడ్చి మళ్లీ సెంటిమెంట్  రగిల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. తన గురించి కేసీఆర్ ఎక్కువ ఊహించుకుంటున్నారన్నారు.

మునుగోడు అభివృద్దిపై కోమటిరెడ్డి రాజగోపాల్  రెడ్డి విసిరిన సవాల్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన  డిమాండ్  చేశారు.మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని  అభివృద్ది  చేసేందుకు కేంద్రం  ఎన్ని  నిధులిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిదులెన్నో చెప్పాలని  బండి సంజయ్ డిమాండ్ చేశారు.మునుగోడు అభివృద్ది  కోసం ఈ ఉఫ ఎన్నికలు వచ్చాయన్నారు. తాను రాజీనామా చేస్తేనైనా మునుగోడు నియోజకవర్గం కోసం కేసీఆర్  నిధులు ఖర్చు చేస్తారనే  ఉద్దేశ్యంతో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా  చేశారని బండి  సంజయ్ గుర్తు చేశారు.

also read:తెలంగాణలోకి సీబీఐకి నో ఎంట్రీ.. రెండు నెలల కిందటే జీవో జారీ చేసిన సర్కార్..!

మునుగోడులో తమ పార్టీ  బహిరంగ సభ  నిర్వహించాలో వద్దో అనేది తమ ఇష్టమన్నారు. టీఆర్ఎస్ నేతల  సవాళ్లకు జవాబు చెప్పడానికి మేం రావాల్సిన అవసరం లేదని తమ  పార్టీ అగ్రనేతలు చెప్పారన్నారు. సభకు బదులుగా  తాము భారీగా ర్యాలీలు  నిర్వహిస్తామని బండి సంజయ్ చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios