పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం దీక్షకు ఉపక్రమించనున్నారు. దీక్షలో భాగంగా రాజ్ ఘాట్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. బండి సంజయ్ తో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరి శ్రీరామ్ తదితరులు ఈ దీక్షలో పాల్గొననున్నారు.
ఢిల్లీ : రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు Bandi Sanjay ఢిల్లీలో నేడు మౌన దీక్ష చేపట్టనున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన Budget అంశాల గురించి నిన్న తెలంగాణ సీఎం KCR ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. Constitutionన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం దీక్షకు ఉపక్రమించనున్నారు. దీక్షలో భాగంగా రాజ్ ఘాట్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని నిర్ణయించారు. బండి సంజయ్ తో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరి శ్రీరామ్ తదితరులు ఈ దీక్షలో పాల్గొననున్నారు.
కాగా, బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన డిమాండ్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అగౌరపరచడమేనని ఆరోపించారు.
ఇలాంటి డిమాండ్ దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టిస్తుందని మండిపడ్డారు. ప్రధాని Narendra Modi, ఆర్థిక మంత్రి Nirmala Sitharamanపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఖండించాలని బండి సంజయ్ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్ కాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
అలాగే, ప్రాథమిక ప్రజారోగ్య సంరక్షణ కంటే కార్పొరేట్ ఆస్పత్రులకు అభిమానం చూపిస్తున్న కేసీఆర్ సర్కార్.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఆరోగ్యం సహా ఇతర రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇంతకు ముందు ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్ ‘గుజరాత్ మోడల్’, వ్యవసాయ చట్టాలను కూడా ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం తన రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారని ఆరోపించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసి దేశమంతా చర్చ జరగాలని కెసిఆర్ కోరుకోవడం మూర్ఖత్వం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పటివరకు రాజ్యాంగం నిర్వీర్యం చేశారని సీఎం కేసీఆర్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతారని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడుతూ ఇది విప్లవాత్మక బడ్జెట్ అని, దేశ పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టిందని అన్నారు.
దేశంలోని కీలకమైన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించకుండా.. ముందుకు సాగిందని.. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాల లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ.. బడ్జెట్ తీసుకువచ్చిందని బండి సంజయ్ తెలిపారు.
