Asianet News Telugu

ఈటెల బీజేపీలో చేరగానే.. కేసీఆర్ భయంతో రోడ్డెక్కాడు... బండి సంజయ్..

తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర అని బీజేపీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దన్నారు.

bandi sanjay fires on kcr  over his district tours - bsb
Author
Hyderabad, First Published Jun 21, 2021, 2:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర అని బీజేపీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దన్నారు.

తెలంగాణ సాధన- అభివృద్ధి మాత్రమే ఈటెల కోరిక అని, ఈటెల బీజేపీ లో చేరగానే సీఎం కు భయం పుట్టిందని ఎద్దేవా చేశారు. ఈటెల బయటకు రాగానే ముఖ్యమంత్రి రోడ్డెక్కారు.

సీఎం టూర్లు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలను- కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆరెస్ లో ఉంటే నిజమైన ఉద్యమకారులు- లేదంటే ఉద్యమ ద్రోహులు అంటారా? అంటూ విరుచుకుపడ్డారు.

సీఎం కేసీఆర్ తనకు లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న నేతలు ఎవరు ఉన్నారో చూసుకోవాలన్నారు. బ్లాక్ మెయిల్ చేసేవాళ్లు,  కమిషన్లు తీసుకునే వాళ్లు టీఆరెస్ లో చాలామంది ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి టి- బీజేపీ పురుడు పోస్తదని చెప్పుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios