Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం.. Bandi Sanjay

జనవరి చివరినాటికి ఉద్యోగాల నోటిఫికేషన్ (Jobs Notifications) ఇవ్వకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు.  అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, బయట కార్యకర్తలు ఆందోళనలు చేస్తారని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతుంటే.. కేసీఆర్ మాత్రం ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని విమర్శించారు. 

bandi sanjay fires on CM KCR On His unemployment deeksha
Author
Hyderabad, First Published Dec 27, 2021, 5:24 PM IST

జనవరి చివరినాటికి ఉద్యోగాల నోటిఫికేషన్ (Jobs Notifications) ఇవ్వకుంటే రాబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.  అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు, బయట కార్యకర్తలు ఆందోళనలు చేస్తారని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ (bandi sanjay) నేడు ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు దిగారు. దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

బీజేపీ దీక్ష అంటే కేసీఆర్‌కు వణుకు పుట్టిందని అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల సీఎం కేసీఆర్ కక్ష కట్టారని ఆరోపించారు. ఉద్యోగాలే రాని తెలంగాణ దేనికోసమే రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఇలాంటి దీక్షలు చేస్తామని ఎన్నడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. ఏడేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఆవేశపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. 

Also Read: కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్

తమ దీక్షను భగ్నం చేసేందుకే కార్యకర్తలను గృహ నిర్భంధం చేశారని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామని భయపడి తమ దీక్షకు కేసీఆర్ అనుమతి ఇవ్వలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు రాత్రికి రాత్రే కోవిడ్ ఆంక్షలు గుర్తుకు వచ్చాయని విమర్శించారు. నిరుద్యోగ సభకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చిందన్నారు. కోవిడ్‌తో ఎందరో ప్రాణాలు కోల్పోతే అప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. 

ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతుంటే.. కేసీఆర్ మాత్రం ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మూడు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios