Asianet News TeluguAsianet News Telugu

ఢిలీకి తెలంగాణ బీజేపీ నేతలు: హైద్రాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలపై చర్చ

బీజేపీ జీతీయ కార్యవర్గ సమావేశాలపై చర్చించేందుకు గాను తెలంగాణకు చెందిన బీజేపీనేతలు బుధవారం నాడు ఢిల్లీకి చేరుకున్నారు.  జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలు చర్చించనున్నారు. 

Bandi Sanjay And other BJP Leaders Reaches To Delhi To Meet National leaders
Author
Hyderabad, First Published Jun 22, 2022, 4:21 PM IST

హైదరాబాద్: BJP  తెలంగాణ ముఖ్య నేతలు బుధవారం నాడు Delhi కి చేరుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల విషయమై బీజేపీ జాతీయ నాయకత్వంతో బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చించనున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  నేతృత్వంలోని  ముఖ్య నేతలు ఇవాళ  ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ఏడాది జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో జరగనున్నాయి. దక్షిణాదిపై ప్రధానంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ తరుణంలో హైద్రాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా హైద్రాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కమలదళం భావిస్తుంది. 10 లక్షలతో ఈ సభను నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది. 

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిపై ప్రధానంగా కేంద్రీకరించింది. 2015లో బెంగుళూరులో, 2016 లో కోజికోడ్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఈ దఫా హైద్రాబాద్ లో నిర్వహిస్తున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చించేందుకు గాను తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీ National Executive Committee పై  బీజేపీ  రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ ముఖ్య నేతలతో జాతీయ అధ్యక్షుడు JP Nadda, కేంద్రమంత్రి Amit Shah, పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి BL Santosh సమావేశం కానున్నారు.

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నేతలు ఎన్‌.రామచంద్ర రావు, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి  తదితరులు సమావేశానికి హాజరుకానున్నారు.

ఫైనాన్స్, పబ్లిక్‌ మీటింగ్, ఆహ్వానం, వీడ్కోలు, రవాణా, భోజనం, అలంకరణ తదితర అంశాలపై ఇప్పటివరకు చేసిన కసరత్తు, ఏర్పాట్లను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా  బీజేపీ నేతలు వివరించనున్నారు. పార్టీ  జాతీయ నాయకత్వం ఈ ఏర్పాట్లలో ఏమైనా మార్పులు చేర్పులు సూచించే అవకాశం ఉంది.  మంగళవారం నాడు బీజేపీ  రాష్ట్ర కార్యాల యంలో ఆర్థిక వ్యవహారాల కమిటీ, బహిరంగసభ ఏర్పాట్లు, ఇతర కమిటీలతో బీజేపీ జాతీయ నేతలు సమావేశమై సమీక్షించారు.

Follow Us:
Download App:
  • android
  • ios