బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్‌(21) హఠాన్మరణం చెందారు. 

హైదరాబాద్: బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్‌(21) హఠాన్మరణం చెందారు. మంగళవారం రాత్రి 10.45కు గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

హైదరాబాద్‌లోని తన స్వగృహంలో భోజనం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ముషిరాబాద్‌లోని గురునానక్‌ కేర్‌ ఆసుపత్రికి తరలించారు. 

అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్‌ ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్నారు.