హైదరాబాద్: తెలంగాణలో మద్యం అమ్మకాలను నిషేదిస్తే తాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కాళ్లు మొక్కడానికి కూడా వెనకాడబోనని కాకినాడ శ్రీ ీఠం పరిపూర్ణానంద సరస్వతి అన్నారు. తెలంగాణలో దశలవారీగా మద్య నిషేధానాన్ని విధించాలని ఆయన కేసీఆర్ ను కోరారు. 2018లో ఆయన బిజెపిలో చేరిన విషయం తెలిసిందే.

తెలంగాణ నుంచి మద్యాన్ని, డ్రగ్స్ ను తొలగిస్తే తాను కేసీఆర్ కాళ్లు మొక్కడానికి కూడా వెనకాడబోనని ఆయన శుక్రవారంనాడు అన్నారు. బిజెపి నేత, మాజీ మంత్రి డీకే ఆరుణ చేపట్టిన మహిళా సంకల్ప దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దశలవారీగా రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆమె రెండు రోజుల దీక్ష చేపట్టారు. 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై పోలీసులను నిందించడం సరి కాదని, వారిని చంపాలనేది ప్రజల కోరిక అని పరిపూర్ణానంద సరస్వతి అన్నారు. 

రాష్ట్రంలో విచక్షణారహితమైన మద్యం అమ్మకాల వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ విడిగా ఓ ప్రకటనలో అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.