హైదరాబాద్ సీపీ, సైఫాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ హైకోర్టును ఆశ్రయించారు. 

హైదరాబాద్ సీపీ, సైఫాబాద్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, సైఫాబాద్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కే సత్తయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ రెడ్డిలపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 3వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంబంధించి తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. సీఆర్‌పీసీ 41 ఏ నోటీసు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించలేదని పేర్కొన్నారు. అక్రమంగా తనను అరెస్ట్ చేసిన పోలీసులపై ర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక, ఇటీవల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఏ అసెంబ్లీ ముట్టడికి పిలునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బల్మూరి వెంకట్‌ సహా పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు వెంకట్‌తో సహా విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని తాము ఖండిస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం చట్టవిరుద్దమని మండిపడ్డారు. 

Scroll to load tweet…