సింగరేణిని ముంచే కుట్ర: కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
సింగరేణిని నట్టేట ముంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. మోడీకి సన్నిహితుడైన అదానీకి బొగ్గు బ్లాక్ లను కట్టబెట్టేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్:సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. హైద్రాబాద్ లోని Trs శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం కక్ష కట్టిందన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. ఇప్పుడేమో Singareniని ముంచే ప్రయత్నాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం తీరును ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు.
Coal బ్లాక్‌లను వేలం వేయొద్దని కోరుతూ సింగరేణి కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేసినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడని బీజేపీ నేతలను నిలదీయాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడుకొనేందుకు కార్మికులు మూడు రోజుల పాటు సమ్మె చేస్తున్నా కూడాBjp నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. కోల్ బ్లాక్ వేలాన్ని ఆపాలని మోదీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణిపై మాట్లాడకుంటే బీజేపీ భరతం పడుతామని Balka Suman హెచ్చరించారు.
కోల్ బ్లాక్‌లను ఆదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలిపారు. గుజరాత్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్‌లను వేలం వేయొద్దని ఆ రాష్ట్రాల సీఎంలు మోడీకి విజ్ఞప్తి చేశారన్నారు. క్షణాల్లోనే ఆ ప్రక్రియను విరమించుకున్నారని ఆయన గుర్తు చేశారు. కానీ సీఎం Kcr కూడా అదే రీతిలో కేంద్రానికి లేఖ రాస్తే మోదీ నుంచి స్పందన లేదని బాల్క సుమన్ విమర్శించారు. బొగ్గు గనులను తన సన్నిహితుడైన అదానీకి కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని సుమన్ ఆరోపించారు.
సింగరేణి తెలంగాణకు కొంగు బంగారమని ఆయన చెప్పారు. ఏ సూచికల్లోచూసినా సింగరేణి టాప్ ప్రభుత్వ రంగ సంస్థగా నిలుస్తోందన్నారు. వంద శాతానికి పైగా లాభాలను సాధిస్తున్న సంస్థ సింగరేణియేనని ఆయన గుర్తు చేశారు. .లాభాల్లో ఉన్న సింగరేణి పై కేంద్రం కుట్ర పన్ని బొగ్గు బ్లాక్ ల వేలానికి దిగిందని ఆయన ఆరోపించారు. గుజరాత్ లో బ్లాక్ లు వేయకుండా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కోల్ ఇండియా కు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కనుకే కేంద్రం అక్కడి సీఎం చెప్పినట్టు విందన్నారు. తెలంగాణ లో టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుకే బీజేపీ కోల్ బ్లాక్ లను ప్రైవేట్ కంపెనీ లకు కట్టబెట్టాలని చూస్తుందని సుమన్ ఆరోపించారు.
రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల విషయం లో తెలంగాణ కు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఈ విషయమై ప్రధాని మోడీ తో కిషన్ రెడ్డి ,బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికుల వెంటే టీ ఆర్ ఎస్ ఉంటుందన్నారు. సమ్మె ముగిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సుమన్ ప్రకటించారు.సింగరేణి కోసం తమ ప్రభుత్వం చేసిన పనులు మరెవ్వరూ చేయలేదన్నారు