హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి శోభాయాత్ర ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఉదయం ఆరున్నర గంటలకల్లా గణపయ్యను వాహనంలో పెట్టి గ్రామంలో ఊరేగిస్తారు.

ఉదయం 9 గంటలకు ప్రముఖుల ప్రత్యేక పూజలు.. 9.30 గంటలకు లడ్డూ వేలాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మరో గంటకు బాలాపూర్ నుంచి చాంద్రాయణ గుట్ట మీదుగా శోభాయాత్ర ప్రారంభమవుతుంది.. గత కొన్నేళ్లుగా ఇదే షెడ్యూల్‌ను అమలు చేస్తూ వస్తున్నారు. అలాంటిది ఇంతవరకు బాలాపూర్ గణపతి మండపాన్ని వీడలేదు.

ఈ సారి వినాయకుడు కళ్లు తెరిచి మూసే విధంగా రూపొందించారు. ఎన్నికల సీజన్ కావడంతో ఈ ఏడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాటకు భారీ డిమాండ్ ఏర్పడింది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నేత కొత్త మనోహర్ రెడ్డి లడ్డూను దక్కించుకునేందుకు పోటీపడుతున్నట్లుగా సమాచారం.