Asianet News TeluguAsianet News Telugu

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలాపూర్ ఎఎస్ఐ నరసింహులు మృతి

బాలాపూర్ ఎఎస్ఐ నరసింహులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

Balapur ASI Narasimhulu dies ten days after suicide attempt in hyderabad
Author
Hyderabad, First Published Dec 2, 2019, 8:28 AM IST

హైదరాబాద్: బాలాపూర్ ఎఎస్ఐ నర్సింహులు డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ సోమవారం నాడు ఉదయం మృతి చెందాడు. ఇన్స్ పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఎఎస్ఐ నర్సింహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని బాలాపూర్ పీఎస్ లో చోటు చేసుకుంది. బాలాపూర్ పీఎస్ లో నరసింహా ఎఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవలే ఏఎస్సై నరసింహాను బాలాపూర్ పీఎస్ నుంచి మంచాల పీఎస్ కు బదిలీ చేశారు. 

స్థానిక ఇన్స్ పెక్టర్ వేధింపులకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోనే తనను బదిలీ చేశారని ఎఎస్ఐ నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గత నెల 22వ తేదీన నరసింహులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అయితే బదిలీపై వెళ్లడం ఇష్టం లేని నరసింహా తన బదిలీని నిలిపివేయాలంటూ సీఐను కోరాడు. అయితే ఆయన అంగీకరించకపోవడంతో బాలాపూర్ పీఎస్ సమీపంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

Also read:బదిలీ చేసిన సీఐపై ఆగ్రహం: పెట్రోల్ పోసుకుని ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

తన బదిలీకి సీఐ సైదులే కారణమంటూ ఆరోపించారు. గాయపడిన ఏఎస్సై నరసింహాను తోటి ఉద్యోగులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. 30శాతం గాయాలపాలైన ఏఎస్సై నరసింహా అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చేర్పించారు. 

ఇకపోతే ఏఎస్సై నరసింహా అంతకు ముందు మేడ్చల్ పీఎస్ లో పనిచేసినట్లు తెలుస్తోంది. సీఐ సైదులు తనను వేధిస్తున్నారంటూ ఏఎస్సై నరసింహా పదేపదే ఆరోపించేవారని తోటి ఉద్యోగులు గుర్తు చేసుకొంటున్నారు.

తప్పుడు ఫిర్యాదుల ఆధారంగానే సీఐ తనను వేధించాడని ఎఎస్ఐ నరసింహులు ఆరోపించారు. అందువల్లే తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. 

తన బదిలీని నిలిపివేయావని ఎన్నిసార్లు కోరినా వినలేదని మదనపడుతున్న నరసింహా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలను ఎలా నమ్ముతారంటూ ఏఎస్సై నరసింహా తలచుకుని పదేపదే ఆవేదన వ్యక్తం చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios