బాలానగర్ మెట్రో స్టేషన్ పేరేంటో తెలుసా?

First Published 16, Nov 2017, 4:58 PM IST
balanagar metro station name changed to ambedkar metro station
Highlights
  • బాలానగర్ మెట్రో స్టేషన్ పేరు ఖరారు
  • అంబేద్కర్ మెట్రో స్టేషన్ గా నామకరణం
  • జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీలో నిర్ణయం

కూకట్ పల్లి  వై జంక్షన్ వద్ద నిర్మిస్తున్న బాలానగర్ మెట్రో స్టేషన్ పేరు ఇప్పటి నుంచి అంబేద్కర్ స్టేషన్ గా మారనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు ఈ నెల 28 న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభంతో నగర రవాణా కష్టాలు తీరనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లోని స్టేషన్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని జీహెచ్ఎంసి నిర్ణయించింది. 
 దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ప్రైవేట్ బాగస్వామ్యంలోని చేపడుతున్న హైదరాబాద్ మెట్రో లో ఓ స్టేసన్ కు అంబెద్కర్ పేరు పెట్టాలని కొందరు కాంగ్రెస్ నేతలు సీఎం ను కలిసి విన్నవించారు. వీరి అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన సీఎం తనకూ ఇదే ఆలోచన ఉందని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పరిశీలించాని కేసీఆర్ మెట్రో సంస్థకు, జీహెచ్ఎంసి అధికారులకు సూచించాడు.
 దీనిపై ఇవాళ సమావేశమైన జీహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీలో చర్చించారు. అందరి సభ్యుల ఆమోదం మేరకు బాలానగర్ మెట్రో స్టేషన్ కు అంబేద్కర్ స్టేషన్ గా నామకరణం చేస్తున్నట్లు స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ మేయర్  బొంతు రామ్మోహన్ ప్రకటించారు.  

loader