బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కరోనాతో బుధవారం నాడు మరణించాడు. హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన కరోనాకు చికిత్స తీసుకొంటున్నాడు.

బుధవారం నాడు కరోనా తీవ్రమై  ఆయన మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. బాలల హక్కుల కోసం ఆయన అనేక పోరాటాలు నిర్వహించాడు.
చిన్న పిల్లల కోసం హెచ్ఆర్‌సీ, కోర్టుల్లో ఆయన పలు కేసులు వేశాడు. ఎంతో మంది బాల కార్మికులకు ఆయన విముక్తి కల్పించాడు. 

also read:షాక్: పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్ అంటూ మహిళకు మేసేజ్

1985లో అచ్యుతరావు బాలల హక్కుల సంఘం ఏర్పాటు చేశాడు. చిన్నపిల్లలపై లైంగిక వేధింపులు, పిల్లలను పనిలో పెట్టుకోవడం కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించింది.పిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడ ఆయన అక్కడికి వచ్చేవాడు. పిల్లల హక్కుల కోసం పోరాటం చేసేవాడు. 

కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ కు చికిత్స తీసుకొనేందుకు ఆయన హైద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన బుధవారం నాడు మధ్యాహ్నం మరణించాడు.అచ్యుతరావు ఓ తెలుగు దినపత్రికలో పనిచేసే కార్టూనిస్టుకు స్వయానా సోదరుడు.