హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జరిపిన చర్చలకు తనను పిలువకపోవడంపై నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి స్పందించారు. కరోనా వ్యాప్తి కట్టడికి విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ కార్యకలాపాలు మొత్తం ఆగిపోయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు వెసులుబాట్లు కల్పించాలని కోరడానికి మెగాస్టార్ చిరంజీవిత, నాగార్జున, తదితర సినీ పెద్దలు కేసీఆర్ ను కలిశారు. 

ఆ చర్చలకు తనను ఎందుకు పిలువలేదో తనకు తెలియదని బాలకృష్ణ అన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయంపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ను కలవడానికి వాళ్లంతా వెళ్లినప్పుడు తనను ఎందుకు పిలువలేదో తెలియదని ఆయన అన్నారు. ఒక వెళ రాజకీయ కోణంలో గతంలో తాను కేసీఆర్ మీద చేసిన విమర్శల కారణంగా తనను పిలువకపోతే తనకు చెప్పాల్సిందని ఆయన అన్నారు. 

Also Read: బాలకృష్ణ ఇష్యూ: గ్లామర్ తగ్గిన టీడీపీ, చంద్రబాబు రాజకీయాలే.

కేసీఆర్ కు తనపై ఎప్పుడూ కోపం లేదని ఆయన అన్నారు. రాజకీయం వేరు, ఇది వేరు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ అభిమానిగా తానంటే కేసీఆర్ కు పుత్రవాత్సల్యం ఉందని, మిగిలినవాటి గురించి తాను మాట్లాడదలుచుకోలేదని ఆనయ అన్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే విషయంపై కూడా బాలయ్య స్పందించారు. నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తు చాలా ఉందని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రావడం అనేది ఎన్టీఆర్ ఇష్టమని, వృత్తిని వదులుకుని రావాలని తాము చెప్పలేమని బాలయ్య అన్నారు. ఇప్పుడు తాను, ఒకప్పుడు తన తండ్రి ఒకేసారి సినిమాల్లో, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నామని అన్నారు. రాజకీయాల్లోకి రావడమనేది వాళ్ల ఇష్టమని ఆయన అన్నారు.  

Also Read: జూ.ఎన్టీఆర్ తో పొసగని పొత్తు: బాలకృష్ణ ఒంటరి అవుతున్నారా?