రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీస్‌పై భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. 

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ ఆఫీస్‌పై భజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడి చేశారు. కార్యాలయంలో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అల్కాపురిలో శివాజీ విగ్రహాన్ని తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయంలోని చొచ్చుకెళ్లి అద్దాలను పగలగొట్టారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. భజరంగ్ కార్యకర్తలను నివారించే ప్రయత్నం చేశారు. అయితే వారు వినిపించుకోకపోవడంతో.. కొందరు భజరంగ్‌దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోకి ఎవరూ వెళ్లకుండా అక్కడ పోలీసులు మోహరించారు.

అయితే అనుమతి లేకుండా అ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోనే తొలగించినట్టుగా మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగానే విగ్రహాల ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.