బాజిరెడ్డి గోవర్థన్ : బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం.. 

Bajireddy Govardhan Biography: నిజాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆయన పేరు ఖరారు చేశారు. ఈ తరుణంలో బాజిరెడ్డి గోవర్థన్ వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.. 

Bajireddy Govardhan Biography, Age, Caste, Children, Family, Political Career KRJ

Bajireddy Govardhan Biography: నిజాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో దిగనున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆయన పేరు ఖరారు చేశారు. ఈ తరుణంలో బాజిరెడ్డి గోవర్థన్ వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.. 

బాల్యం, విద్యాభ్యాసం

గోవర్ధన్ 17 ఫిబ్రవరి 1953లో దిగంబర్, శాంతమ్మ దంపతులకు నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలోని చిమన్‌పల్లె గ్రామంలో జన్మించాడు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి 1992లో బిఏ పూర్తిచేశాడు. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయం చేశాడు.  గోవర్ధన్ కు శోభారాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం 

గోవర్ధన్ స్వతంత్రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యాడు. 1994లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి టీడీపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత ఆయన పిఏసిఎస్ ఛైర్మన్‌గా పనిచేశాడు. హౌసింగ్ బోర్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఆ తరువాత ఆయన  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999–2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా, 2004–2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. 

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2014 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆయన గులాబీ గూటికి చేరారు. ఈ సమయంలో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్( డీఎస్)  పై 26,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డి పై 29,855 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. 2015–2018 వరకు, తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై ​​హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. 2021 సెప్టెంబరు 16న బాజిరెడ్డి  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మ‌న్‌గా నియమితులయ్యారు. ఈ పదవిలో 2023 సెప్టెంబరు 20న బాధ్యతలు చేపట్టాడు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios