Asianet News TeluguAsianet News Telugu

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్ బండి’ ఫేమ్ అశోక్

బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అశోక్.

badangpet town planning officer caught by acb officials while taking bribe
Author
First Published Sep 20, 2022, 5:47 PM IST

బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అశోక్. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్నాడు అశోక్. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు అశోక్. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా.. వలపన్ని పట్టుకున్నారు. గతంలో బుల్లెట్ బండి సాంగ్‌తో అతను సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ALso REad:బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసిన నర్స్.. వీడియో వైరల్.. మెమో జారీ చేసిన వైద్యాధికారులు... (వీడియో)

ఇకపోతే.. అవినీతికి పాల్ప‌డుతూ దొరికిపోయిన పోలీసు అధికారికి ఏసీబీ కోర్టు ఈ నెల ఆరంభంలో జైలు శిక్ష విధించింది. దీంతో పాటు జ‌రిమానా క‌ట్టాల‌ని ఆదేశించింది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌స్తుతం మాదాపూర్ ఎస్ఐగా ప‌ని చేస్తున్న కే.రాజేంద్ర గ‌తంలో రాయదుర్గం పోలీసు స్టేష‌న్ లో ఎస్ఐగా ప‌ని చేశారు. 2013 సంవ‌త్స‌రంలో ఎస్ ఐ అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఇర్షాద్ ఖురేష్ అనే వ్య‌క్తికి సంబంధించిన బైక్ ను విడుద‌ల చేసేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. 

దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. అత‌డి నుంచి ఫిర్యాదును స్వీక‌రించారు. ఖురేష్ ఎస్ఐకు లంచం అందిస్తుండ‌గా ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు. దీనిపై అప్ప‌ట్లోనే పోలీసులు కేసు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి ఏసీబీ కోర్టులో విచార‌ణ సాగుతోంది. తాజాగా ఈ కేసులో కోర్టు తీర్పు వెలువ‌రించింది. రెండు సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించ‌డంతో పాటు ఐదు వేల రూపాయిల ఫైన్ వేసింది. ఫైన్ క‌ట్ట‌కపోతే మూడు నెల‌ల పాటు శిక్ష పెరుగుతుంద‌ని పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios