Asianet News TeluguAsianet News Telugu

గీతం వర్శిటీలో ఘోరం.. ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థిని సూసైడ్

GITAM University student suicide : గీతం యునివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదో అంతస్తు నుంచి దూకి ఈ దారుణానికి ఒడిగట్టారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన యువతి.. మూడు నెలల కిందట ఈ వర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో చేరారు.

Bad news in Geetam University.. Student commits suicide by jumping from the fifth floor..ISR
Author
First Published Jan 5, 2024, 8:15 PM IST

సంగారెడ్డి జిల్లాలో ఉన్న గీతం యూనివర్సిటీ ఘోరం జరిగింది. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల రేణుశ్రీ  (Renu sri) ఆత్మహత్మ చేసుకుంది. ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. మృతురాలి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆమె మూడు నెలల కిందట గీతం వర్సిటీలో చేరింది. కానీ ఇంతలోనే ఈ దారుణానికి ఒడిగట్టింది.

అయ్యో.. దేశంలో అత్యంత వృద్ధ ఎలుగుబంటి ‘బబ్లూ’ మృతి.

ఏం జరింగిందో ఏమో తెలియదు కానీ.. రేణు శ్రీ శుక్రవారం మధ్యాహ్నం రుద్రారంలోని వర్సిటీ భవనం ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

హైజాగ్ కు గురైన భారతీయులున్న నౌక.. సోమాలియా తీరంలో ఘటన.. రంగంలోకి ఐఎన్ఎస్ చెన్నై

రేణుశ్రీ మూడు నెలల క్రితం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో చేరారు. ఇంతలోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడింది. ఈ ఘటనపై సమచారం అందటంతో ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణించడంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. ఈ ఘటనతో క్యాంపస్ మొత్తం మూగబోయింది.

బీఆర్ఎస్ అక్రమాలపై కాంగ్రెస్ ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు ? - బీజేపీ నేత మురళీధర్ రావు

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios