Asianet News TeluguAsianet News Telugu

దీనికేమి సమాధానం చెబుతారు మోడిజీ

ప్రభుత్వ బ్యాంకులకు ఇప్పటి వరకూ రావాల్సిన మొండి బకాయిలు సుమారు 8.32 లక్షల కోట్లుగా కాగ్ పేర్కొన్నది.

bad debts raised to  Rs 8 Lakh Cr

కొంతమంది బడా బాబులకు ఆదాయపు పన్ను శాఖ కల్పించిన లాభం, ఎగ్గొట్టిన బకాయిలపై కాగ్ ఇచ్చిన నివేదికపై పెద్ద దుమారమే రేగుతోంది. నల్లధనం గురించి మాట్లాడుతున్న మోడి బడా పారిశ్రామిక వేత్తలు బ్యాంకులకు చెల్లించాల్సిన లక్షల కోట్ల గురించి మాత్రం మాట్లాడటం లేదు.

 

 దానికి తోడు ఆర్ధిక శాఖ సహాయ మంత్రి బుధవారం రాజ్యసభలో స్వయంగా చేసిన ప్రకటన కూడా ఆందోళనగానే ఉంది. కాగ్ నివేదిక ప్రకారం కొందరు బడా పారిశ్రామికవేత్తలకు రూ. 4500 కోట్ల మేర ఆదాయపు పన్ను శాఖ లాభం చేకూర్చింది. అలాగే, బడా పారిశ్రామిక వేత్తలు ఎగ్గొట్టిన మొత్తం రూ. 8.32 లక్ష్లలుగా పేర్కొన్నది.

 

కాగ్ నివేదిక ప్రకారం రిలయన్స్ కు రూ. 1767 కోట్లు, జెఎస్ డబ్ల్యూ ఎనర్జీకి రూ. 340 కోట్లు, రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు రూ. 51.88 కోట్లు, టాటా పవర్ కు రూ. 37 కోట్లు, గుజరాత్ ఫ్లురో కెమికల్స్ కు రూ. 22.75 కోట్లు ట్యాక్స్ హాలిడేను ప్రకటించినట్లు కాగ్ తన నివేదికలో ఐటి శాఖను ఎండగట్టింది.

 

పనిలో పనిగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్న బడా బాబుల సంఖ్య కూడా పెరిగిపోతోందని కూడా కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ బ్యాంకులకు ఇప్పటి వరకూ రావాల్సిన మొండి బకాయిలు సుమారు 8.32 లక్షలుగా కాగ్ పేర్కొన్నది. ఈ మొత్తం గత ఏడాది రూ. 7.28 లక్షల కోట్లుగా కాగ్ వివరించింది.

 

అంటే, కాగ్ నివేదిక ప్రకారం ఒక్క ఏడాదిలోనే బడా బాబులు ఎగ్గొట్టిన మొత్తం రూ. 1.04 లక్షల కోట్లు పెరిగింది. ఇదే విషయమై ఆర్ధికశాఖ సహాయమంత్రి మాట్లాడుతూ, రూ 50 కోట్లకు పైగా రుణాలు తీసుకుని ఎగ్గొటిన వారి సంఖ్య 2071గా పేర్కొన్నరు. వాళ్ళు చెల్లించాల్సిన మొత్తమే సుమారు 3.88 లక్షల కొట్లని చెప్పారు.

 

బ్యాంకులకు డబ్బు చెల్లించకుండా ఎగవేసిన వారిలో 80 శాతం వ్యాపారులేనని కూడా మంత్రి చెప్పటం ప్రధాన మోడికి దృష్టికి వెళ్ళిందో లేదో.

 

 

 

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios