తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజుల నిర్వహించాలనే దానిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకొంటారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇవాళ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై చర్చించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly session) ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (pocharam srinivas Reddy నిర్ణయం తీసుకొంటారని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో శాసనసభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించారు. 

also read:Telangana Assembly: మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం, ఈ నెల 27 వరకు వాయిదా

కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు బీఎసీ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.అక్టోబర్ 5వ తేదీ వరకు సభ నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూల్ సిద్దం చేసింది.ఎన్ని రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చ జరిగింది. 20 రోజులపాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు. 

అయితే 20 రోజుల పాటు సభ నిర్వహించేందుకు తమకు అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే ఎన్ని రోజుల పాటు సభ నిర్వహించాలనే దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే

ఈ సమావేశంలో