Asianet News TeluguAsianet News Telugu

అచ్చంపేట ఘటనపై విచారణ: పోలీసుల చెంతకు శిశువు తల

డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది. ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Baby gets beheaded during birth in Achampet govt hospital Government order to investigate the incident
Author
Achampet, First Published Dec 21, 2019, 2:54 PM IST

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలోని ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మహిళ తన బిడ్డను కోల్పోయిన సంగతి తెలిసిందే. డెలీవరి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడు శిశువు తల కోసేయడంతో.. బిడ్డ మొండెం తల్లిగర్భంలోనే ఉండిపోయింది.

ఈ ఘటనపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నివేదిక ఆధారంగా ఆధారంగా కుటుంబసభ్యుల నుంచి నిపుణుల బృందం వివరాలు సేకరించింది.

Also Read:డెలీవరి సమయంలో శిశువు తల కోసేసిన వైద్యుడు, తల్లి గర్భంలోనే బిడ్డ మొండెం

దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ తారాసింగ్ మాట్లాడుతూ.. సదరు గర్భిణీ కుటుంబసభ్యులు మృత శిశువుతోనే ఆసుపత్రికి వచ్చారని చెబుతున్నారు. కుళ్లిన దశ ఉండటంతో డెలివరీ చేసే సమయంలో తల ఊడి వచ్చిందని ఆయన తెలిపారు.

తల్లిని బతికించేందుకు హుటాహుటిన హైదరాబాద్‌ తీసుకెళ్లామని శిశువు తలను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. శుక్రవారం డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆసుపత్రి దగ్గర పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. 

కొద్దిరోజుల క్రితం కల్పాక్కం సమీపంలోని కడలూరుకు చెందిన బొమ్మి (28)ని బుధవారం ఉదయం ప్రసవం కోసం కూవత్తురు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో నర్సులే బొమ్మిని పరీక్షించి ప్రసవం చేయడానికి సిద్ధపడ్డారు.

ఆపరేషన్‌ థియేటర్‌లో పురుడు పోస్తున్న సమయంలో గర్భాశయం నుంచి కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను పట్టుకుని బలంగా లాగారు. దీంతో మొండెం నుంచి తల తెగిపోయి బయటకు వచ్చింది. మిగిలిన దేహం గర్భాశయంలోనే ఉండిపోయింది. భయాందోళనలకు గురైన నర్సులు ఆస్పత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 

Also read:వైద్యుల నిర్లక్ష్యం.. తెగిపడిన కడుపులో బిడ్డ తల

శిశువు మొండెం గర్భాశయంలోనే ఉండిపోవడంతో బొమ్మి కుటుంబీకులు ఆమెను వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి శిశువు దేహాన్ని వెలికి తీశారు.

ప్రస్తుతం బొమ్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులు, విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios