అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్ధిని మరణం, ఏమైంది?

First Published 5, Jul 2018, 4:23 PM IST
B.Tech student Swetha suspect death in Nalgonda district
Highlights

నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్ధిని శ్వేత అనుమానాస్పదస్థితిలో మరణించింది. పరీక్ష రాసి ఇంటికి వస్తున్న తమ కూతురిని భరత్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తలకు తీవ్రమైన గాయాలతో శ్వేత హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.


హైదరాబాద్: నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్ధిని శ్వేత అనుమానాస్పద స్థితిలో గురువారం నాడు మృతి చెందింది. హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  ఆమె మృతి చెందింది. భరత్ అనే విద్యార్ధిపై శ్వేత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 

పరీక్ష రాసి వస్తున్న సమయంలో  శ్వేతను భరత్ కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే మూడు రోజుల క్రితం తలకు తీవ్ర గాయాలతో ఉన్న శ్వేతను స్నేహితులు హైద్రాబాద్‌ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్వేత మరణించింది..

శ్వేత తలకు  ఎలా గాయాలయ్యాయి, ఆమెను ఎవరెవరు కిడ్నాప్ చేశారనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే శ్వేత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader