హైద్రాబాద్ కీసరలో బిటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
హైద్రాబాద్ లో బీటెక్ విద్యార్ధి ఆకాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: నగరంలోని కీసరలో బీటెక్ చదువుతున్న ఆకాష్ రెడ్డి అనే విద్యార్ధి శుక్రవారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ని గదిలోనే ఆకాష్ రెడ్డి ఉరేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని ఆకాష్ రెడ్డి సూసైడ్ లెటర్ రాశాడు.
రాష్ట్రంలో వరుసగా విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటర్ స్టూడెంట్స్ తో పాటు ఉన్న త చదువులు చదువుకుంటున్న విద్యార్ధులు పలు కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంటర్ చదివే విద్యార్ధుల్లో ఎక్కువగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. గత నెల 28వ తేదీన హైద్రాబాద్ నార్సింగి శ్రీ చైతన్య కాలేజీ విద్యార్ధి సాత్విక్ సూసైడ్ చేసుకున్నాడు. కాలేజీ లెక్చరర్ల వేధింపుల కారణంగా సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు బైపీసీ చదివే రమాదేవి అనే విద్యార్ధిని కూడా ఆత్మహత్య చేసుకుంది. రమాదేవి కంటే ముందు మరో ఇద్దరు విద్యార్ధులు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
రెండు రోజుల క్రితం మహబూబా్ నగర్ మణికొండలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీ విద్యార్ధి శివకుమార్ ఆత్మహత్య చేసుకన్నాడు. ఇంటర్ చదివే శివకుమార్ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. శివకుమార్ అంత్యక్రియలు హడావుడిగా నిర్వహించారు. శివకుమార్ చదువుకున్న కాలేజీ ముందు ఇవాళ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.
also read:మహబూబ్‌నగర్ లో ఇంటర్ విద్యార్ధి సూసైడ్: కాలేజీ ముందు విద్యార్ధుల ఆందోళన
ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2500 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రికార్డులు చెబుతున్నాయి. విద్యార్ధుల ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇంటర్ కాలేజీల్లో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సైక్రియాటిస్ట్ ను నియమించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.