Asianet News TeluguAsianet News Telugu

అక్బరుద్దీన్ ఓవైసీని కలిసిన అయ్యప్పభక్తులు... ఎందుకో తెలుసా?

తాజాగా చాంద్రాయణగుట్ట పరిధిలో నివసించే అయ్యప్పభక్తులు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వినతిపత్రం అందించారు. 

ayyappa devotees meets akbharuddin owaisi
Author
Hyderabad, First Published Feb 15, 2021, 11:39 AM IST

హైదరాబాద్: భారతదేశంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నగరం ఏదంటే ముందుగా గుర్తొచ్చే పేరు హైదరాబాద్.  ఇక్కడ హిందూ, ముస్లింలతో పాటు మరెన్నో మతాలవారు జీవిస్తున్నప్పటికి హైదరబాదీలమంతా అన్నదమ్ములమే అనేలా కలిసిమెలిసి వుంటారు. ఇందుకు ఉదాహరణ నిలిచే సంఘటన ఒకటి తాజాగా చోటుచేసుకుంది.  

ముస్లిం వర్గానికి చెందిన పార్టీగా ముద్రపడిపోయిన ఎంఐఎం పార్టీ తరపున పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ఓవైసి ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో హిందువులు అల్ప సంఖ్యలో వుంటారు. అయినప్పటికి వారి ప్రయోజనాలు కాపాడటం, సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందిస్తుంటారు ఎమ్మెల్యే. 

తాజాగా చాంద్రాయణగుట్ట పరిధిలో నివసించే అయ్యప్పభక్తులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు వినతిపత్రం అందించారు. ఎంఐఎం కార్యాలయం దారుసల్లాంకు చేరుకున్న అయ్యప్పభక్తులు అక్బరుద్దీన్ కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios